ప్రధాని విమానం సాధారణ మార్గాన్ని కాకుండా ప్రత్యేక రూట్‌లో ప్రయాణించింది. భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్, ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా తప్పించింది. మోదీ విమాన ప్రయాణ మార్గం ఇలా సాగింది.
* మొదట ఢిల్లీలోని పలం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరింది. గుజరాత్ మీదుగా ప్రయాణించింది.
* అనంతరం అరేబియా సముద్రం దాటింది.
* అలా ఒమాన్ చేరుకుంది.
* అక్కడి నుంచి సౌదీ అరేబియా గగనతలంలో ప్రయాణించింది
* తరువాత జోర్డాన్ మీదుగా వెళ్లింది
* చివరకు ఇజ్రాయెల్‌లో దిగింది. విమానం బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది.
సాధారణంగా భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు నేరుగా ప్రయాణిస్తే 6–7 గంటలు పడుతుంది. అయితే ఈసారి ప్రత్యేక మార్గం కారణంగా ప్రయాణ సమయం కొద్దిగా పెరిగింది.