పెళ్లికి అడ్డొచ్చిన జాత‌కం, శారీర‌కంగా క‌ల‌వ‌డానికి రాలేదా.? హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

Published : Feb 24, 2026, 01:10 PM IST

High Court: పెళ్లి చేసుకుంటాన‌ని మాటిచ్చి శారీర‌కంగా వాడుకుని, పెళ్లి నిరాకరిస్తే అది నేరంగా పరిగణించవచ్చని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వకుండా కోర్టు తిరస్కరించింది.  

PREV
15
కేసు నేపథ్యం

త‌న‌ను వివాహం చేసుకుంటాన‌ని న‌మ్మించి, త‌న‌తో ప‌లుసార్లు శారీరక సంబంధం పెట్టుకున్న వ్య‌క్తి ఇప్పుడు పెళ్లికి నిరాక‌రిస్తున్నాడ‌ని ఓ మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. తాము చాలా కాలంగా సంబంధంలో ఉన్నామ‌ని ఆమె తెలిపింది. తీరా పెళ్లి చేసుకుందాం అనేస‌రికి జాతకాలు కుదరలేదని చెప్పి నిందితుడు పెళ్లి నిరాకరించాడని మహిళ ఫిర్యాదు చేసింది.

25
పెళ్లికి హామీ

కోర్టు ముందు వచ్చిన వివరాల ప్రకారం నిందితుడు వాట్సాప్ చాట్స్‌లో కూడా పెళ్లి గురించి స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. జాతకాలు కుదిరాయని, పెళ్లికి ఎలాంటి అడ్డంకి లేదని అతడు మహిళకు చెప్పినట్లు సమాచారం. ఒక మెసేజ్‌లో "రేపే మన పెళ్లి జరుగుతుంది" అని కూడా పంపిన‌ట్లు వెల్లడైంది.

35
ముందు ఫిర్యాదు ఉపసంహరణ

మహిళ చెప్పిన వివరాల ప్రకారం, మొదట కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నిందితుడితోపాటు అతని కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. కానీ తర్వాత మళ్లీ జాతకాలు కుదరలేదని చెప్పి పెళ్లి చేయడానికి నిరాకరించాడు.

45
కోర్టు కీలక వ్యాఖ్యలు

నిందితుడు ముందుగా ఇచ్చిన హామీలకు విరుద్ధంగా తర్వాత జాతకాలు కుదరలేదని చెప్పడం అనుమానాస్పదమని కోర్టు పేర్కొంది. జాతకాలు అంత ముఖ్యమైన అంశం అయితే, శారీరక సంబంధం పెట్టుకునే ముందు ఆ విషయం స్పష్టంగా చెప్పాల్సిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తప్పుడు హామీతో మహిళ అంగీకారం పొందినట్లు కనిపిస్తోందని కోర్టు తెలిపింది.

55
బెయిల్ తిరస్కరణ

ఈ కేసులో నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు అయింది. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 376తో పాటు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 కింద కేసు నమోదైంది. తప్పుడు పెళ్లి హామీతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు ప్రాథమికంగా కనిపిస్తున్నందున బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పెళ్లి పేరుతో మహిళలను మోసం చేయడం చట్టపరంగా తీవ్రమైన నేరం అని మరోసారి స్పష్టమైంది. జాతకాలు కుదరలేదని చెప్పడం కారణంగా బాధ్యత తప్పించుకోవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది.

Read more Photos on
click me!

Recommended Stories