Passport: భార‌తదేశంలో ఎంత మంది ద‌గ్గ‌ర పాస్‌పోర్ట్ లేదో తెలుసా.? నెంబ‌ర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Published : Jul 17, 2025, 11:39 AM IST

ఇత‌ర దేశాల‌కు వెళ్లాలంటే క‌చ్చితంగా పాస్‌పోర్ట్ ఉండాల‌నే విష‌యం తెలిసిందే. అయితే భార‌త్‌లో ఎంత మంది ద‌గ్గ‌ర పాస్‌పోర్ట్ ఉందో తెలిస్తే మీరు క‌చ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే గ‌ణంకాలు అలా ఉన్నాయి మ‌రి. వివ‌రాల్లోకి వెళితే.. 

PREV
15
భారతదేశంలో పాస్‌పోర్ట్ కలిగినవారి శాతం ఎంత?

2024 ఫిబ్రవరి 8వ తేదీ నాటికి భారతదేశంలో 9,26,24,661 పాస్‌పోర్టులు జారీ అయ్యి ప్రస్తుతం చెలామణిలో ఉన్నాయి. ఇది 2023 డిసెంబరు 31 నాటికి భారత జనాభాలో సుమారు 6.5 శాతమే. అంటే ప్రతి 100 మంది భారతీయుల్లో కేవలం 6-7 మందికే పాస్‌పోర్ట్ ఉందన్నమాట.

ఈ గణాంకాలు చూస్తే, దేశంలో అంతర్జాతీయ ప్రయాణం చేసే అవకాశం ఇప్పటికీ చాలా తక్కువ మందికే అందుబాటులో ఉందని అర్థమవుతుంది. ఇప్పటికీ సుమారు 93.5 శాతం మంది పాస్‌పోర్ట్ లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు.

25
రాష్ట్రాల వారీగా పాస్‌పోర్ట్ కలిగినవారి లెక్క

భారత రాష్ట్రాల్లో కేరళ అత్యధికంగా పాస్‌పోర్ట్ కలిగిన జనాభా కలిగిన రాష్ట్రంగా నిలిచింది. కేరళలో చాలా మంది కుటుంబాలు విదేశాల్లో జీవిస్తున్న నేపథ్యం వల్ల, అక్కడ అంతర్జాతీయ ప్రయాసలు ఎక్కువగా జరుగుతుంటాయి.

ఇక పురుషుల్లో ఉత్తరప్రదేశ్ అత్యధికంగా పాస్‌పోర్ట్ కలిగినవారి రాష్ట్రంగా ఉండగా, మహిళల పాస్‌పోర్ట్ కలిగిన శాతం కేరళలోనే అత్యధికం. ఈ గణాంకాలు రాష్ట్రాల అభివృద్ధి, అవగాహన స్థాయి, మైగ్రేషన్ ధోరణులను బలంగా ప్రతిబింబిస్తున్నాయి.

35
పెరుగుతోన్న పాస్‌పోర్టుల జారీ

పాస్‌పోర్ట్ హోల్డ‌ర్స్ త‌క్కువే ఉన్నా 2014తో పోలిస్తే 2023 నాటికి సంవత్సరానికి జారీ అయ్యే పాస్‌పోర్టుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. 2023లో మొత్తం 1.37 కోట్లు పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. ఈ గణాంకం భారతీయుల ప్రయాణావకాశాలు పెరుగుతున్నాయని సూచించడమే కాక, ప్రభుత్వ పాస్‌పోర్ట్ సేవల మౌలిక సదుపాయాలు మెరుగ‌య్యాయ‌ని చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

45
భారత పాస్‌పోర్ట్ పవర్ – వీసా ఫ్రీ దేశాలు

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం, భారత పాస్‌పోర్ట్ కలిగిన వారు 57 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ సౌకర్యంతో వెళ్లవచ్చు. వీటిలో ఎక్కువ‌గా ఆఫ్రికా, దక్షిణ ఆసియాతో పాటు కొన్నిమార్జినల్ ఐలాండ్ దేశాలు ఉన్నాయి.

కాగా సింగపూర్ (195 దేశాలు), జపాన్ (193), అమెరికా (186) వంటి దేశాల పాస్‌పోర్ట్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. భారత పాస్‌పోర్ట్ గ్లోబల్ ట్రావెల్ ఫ్రీడమ్ పరంగా ఇప్పటికీ చాలా వెనుకబడిన స్థాయిలో ఉంది.

55
ర్యాంకింగ్స్‌లో భారత్ దిగజారిన స్థితి

2025లో భారత్‌ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ 85వ స్థానానికి పడిపోయింది. 2024లో ఇది 80వ స్థానంలో ఉండగా, ఇది గత నాలుగేళ్లలో అత్యంత తక్కువ ర్యాంక్. ఈ ర్యాంక్ పడిపోయేందుకు కారణాలు చాలా ఉండొచ్చు. భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకునే దేశాల సంఖ్య తగ్గిపోవడం, అంతర్జాతీయ విధానాల మార్పు, లేదా భారతీయ పాస్‌పోర్ట్‌పై ట్రావెల్ చేసేందుకు మరింత నిబంధనలు ఉండటం వంటివి కార‌ణాలుగా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories