అమెరికా, రష్యా, చైనా వంటి అత్యాధునిక సైనిక సంపత్తి కలిగిన దేశాల సరసన చేరే గేమ్-ఛేంజింగ్ హైపర్‌సోనిక్ క్షిపణిని భారతదేశం పరీక్షించింది. ఏమిటీ మిస్సైల్? దీని ప్రత్యేకతలేంటి? ఇక్కడ తెలుసుకుందాం.
Extended Trajectory Long Duration Hypersonic Cruise Missile (ET-LDHCM)
అమెరికా, రష్యా, చైనా వంటి ప్రపంచ సైనిక శక్తులతో పోటీపడేలా భారత సైన్యం బలోపేతమవుతోంది. అత్యాధునిక టెక్నాలజీతో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు సైనిక ఆయుధ సంపత్తిలో చేరుతున్నాయి. ఇలా తాజాగా భారతదేశం కొత్త హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది. ఈ మిస్సైల్ ఎక్స్‌టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ (ET-LDHCM) అని పిలువబడుతుంది… ఇది DRDO (Defence Research and Development Organisation) ప్రాజెక్ట్ విష్ణు కింద అభివృద్ధి చేస్తోంది.
25
ధ్వని కంటే వేగంగా ప్రయాణం
ET-LDHCM ధ్వని వేగం కంటే 8 రెట్లు (గంటకు సుమారు 11,000 కిలో మీటర్ల) వేగంతో ప్రయాణించి 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఇది బ్రహ్మోస్ క్షిపణి పరిధిని మించిపోయింది. ప్రపంచంలోని అగ్రదేశాల హైపర్‌సోనిక్ ఆయుధాలతో ఈ భారతీయ మిస్సైల్ పోటీ ఇవ్వగలదు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరీక్ష జరిగింది. ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత, టర్కీ-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు భారతదేశం తన క్షిపణి ఆయుధాగారాన్ని ఆధునీకరించాల్సిన అవసరాన్ని పెంచింది.
35
Game-Changing Strategic Edge
ET-LDHCM లో స్క్రామ్‌జెట్ ఇంజిన్ ఉంది. ఇది వాతావరణ ఆక్సిజన్‌ను ఉపయోగించే ఎయిర్-బ్రీతింగ్ ప్రొపల్షన్ వ్యవస్థ. ఇది నిరంతర హైపర్‌సోనిక్ వేగాన్ని పెంచుతుంది… సాంప్రదాయ రాడార్ వ్యవస్థల ద్వారా క్షిపణిని అడ్డగించడం లేదా ట్రాక్ చేయడం కష్టతరం అవుతుంది.
1,000, 2,000 కిలోగ్రాముల మధ్య ఉన్న క్షిపణి పేలోడ్ సామర్థ్యం, సాంప్రదాయ, అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లడానికి వీలు కల్పిస్తుంది. భూమి, గాలి లేదా నావికా వేదికల నుండి దీన్ని ప్రయోగించవచ్చు. హైపర్‌సోనిక్ క్రూయిజ్ దశలో 2,000°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునేలా క్షిపణి రూపొందించబడింది.
ప్రస్తుతం, రష్యా, చైనా, అమెరికా మాత్రమే హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి సాంకేతికతను కలిగి ఉన్నాయి. భారతదేశ ET-LDHCM పరీక్ష విజయవంతమైతే అది వ్యూహాత్మక మైలురాయిగా నిలుస్తుంది.
55
ఒకే మిస్సైల్ పాక్, చైనాకు జవాబు
పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ET-LDHCM వంటి క్షిపణులు భారత్ సైనిక బలాన్ని మరింత పెంచుతాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం చెలాయించడానికి సిద్దమవుతున్న సమయంలో ఇలాంటి ఆయుధ సంపత్తి మనదగ్గర ఉండటం రక్షణ పరంగా చాలా కీలకం. క్షిపణి పనితీరుపై అధికారిక సమాచారం లేకున్నా ET-LDHCM భారత రక్షణవ్యవస్థను బలోపేతం చేస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.