Narendra Modi Birthday : మోదీకి ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉంది? అందులో ఎంత డబ్బు ఉంది?

Published : Sep 16, 2025, 06:01 PM IST

Narendra Modi Birthday : దశాబ్దానికి పైగా గుజరాత్ ముఖ్యమంత్రిగా, గత దశాబ్ద కాలంగా దేశ ప్రధానిగా అత్యున్నత పదవుల్లో ఉన్న నరేంద్ర మోదీ ఆస్తిపాస్తులెన్నో తెలుసా? ప్రధాని 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ప్రధాని మోదీ భర్త్ డే స్పెషల్

Narendra Modi Birthday: సెప్టెంబర్ 17న అంటే రేపు (బుధవారం) భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. 74 ఏళ్ళను పూర్తిచేసుకుని 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా 2001 నుండి 2014 వరకు అంటే వరుసగా 13 ఏళ్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా... 2014 నుండి ఇప్పటివరకు వరుసగా 11 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన మోదీ ఆస్తిపాస్తులు ఎన్నో తెలుసుకుందాం.

దేశ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుండి నరేంద్ర మోదీ ఆస్తులపై ఓ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఆయనకు ఇప్పటికీ సొంత కారు లేదు... సొంత ఇల్లు, భూమి కూడా లేవు. గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ భవనంలోని నివాసం... ప్రభుత్వ వాహనంలోనే ప్రయాణం సాగిస్తున్నారు.

25
నరేంద్ర మోదీకి మూడు కోట్లకు పైగా ఆస్తి

2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో తన వద్ద 3 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉందని అందులో తెలిపారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2018 నుంచి 2024 వరకు పీఎం మోదీ ఆస్తులు పెరుగుతూ వస్తున్నాయి.

2022-2023 ఆర్థిక సంవత్సరం - ప్రధాని మోదీ ఆస్తులు రూ.23,56,080

2021-2022 ఆర్థిక సంవత్సరం - ప్రధాని మెదీ ఆస్తులు రూ.15,41,870

2020-2021 ఆర్థిక సంవత్సరం - ప్రధాని మోదీ ఆస్తులు రూ.17,07,930

2019-2020 ఆర్థిక సంవత్సరం - ప్రధాని మెదీ ఆస్తులు రూ.17,20,760

2018-2019 ఆర్థిక సంవత్సరం - ప్రధాని మోదీ ఆస్తులు రూ.11,14,230

35
పీఎం మోదీ బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్

నరేంద్ర మోదీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), గాంధీనగర్  శాఖలో అకౌంట్ ఉంది. ఇందులో రూ.2,86,40,642 పిక్సుడ్ డిపాజిట్ రూపంలో జమచేసినట్లు సమాచారం. దీని ద్వారా ఆయనకు వడ్డీ రూపంలో మంచి ఆదాయం వస్తుంది... అవే ఖర్చులకు ఉపయోగించుకుంటారని పిఎంవో వర్గాలు చెబుతుంటాయి.

ప్రధాని మెదీ వద్ద ఎలాంటి బాండ్లు లేవు... ఆయన షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టలేదు. ఎన్ఎస్ఎస్‌లో పీఎంకు 9 లక్షల రూపాయలకు పైగా జమ అయి ఉన్నాయి. నరేంద్ర మోదీ ఎల్ఐసీ లేదా మరే ఇతర కంపెనీ నుంచి జీవిత బీమా తీసుకోలేదు.

పీఎం మోదీకి సొంత కారు కూడా లేదు. ఆయన ఎవరికీ అప్పు ఇవ్వలేదు... ఎవరివద్ద అప్పు చేయలేదు. నగల విషయానికొస్తే మోదీ దగ్గర నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. 2024లో వాటి విలువ రూ. రూ.2,67,750గా తెలిపారు.

45
ప్రధాని మోదీకి స్థిరాస్తులు?

ఏ నాయకుడికైనా, వ్యాపారికైనా ఆస్తిలో ఎక్కువ భాగం స్థిరాస్తుల రూపంలోనే ఉంటుంది... కానీ నరేంద్ర మోదీ భిన్నం. ఆయనకు ఒక్క రూపాయి విలువైన స్థిరాస్తి కూడా లేదు. నరేంద్ర మోదీకి భూమి లేదు... వ్యవసాయ లేదా వాణిజ్యపరంగా ఆయనకు ఎలాంటి భూమి లేదు. నరేంద్ర మోదీకి సొంత ఇల్లు కూడా లేదు. ప్రధానమంత్రిగా వచ్చే జీతం, బ్యాంకులో జమ చేసిన డబ్బుపై వచ్చే వడ్డీనే ఆయన ప్రధాన ఆదాయ వనరులు.

55
నరేంద్ర మోదీ నెల జీతం ఎంత?

ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినందుకు నరేంద్ర మోదీకి ప్రతి నెలా రూ. 1.66 లక్షల జీతం అందుతుంది. దీనితో పాటు, ఆయనకు భత్యాల రూపంలో కూడా మంచి మొత్తంలో డబ్బు వస్తుంది. ఇందులో పార్లమెంటరీ భత్యం (రూ. 45,000), ఖర్చుల భత్యం (రూ. 3000), రోజువారీ భత్యం (రూ. 2000) ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories