ఈ సేల్ సమయంలో ప్రయాణికులు 6E యాడ్-ఆన్ సర్వీసులపై కూడా భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఎంపిక చేసిన మార్గాల్లో ప్రీపెయిడ్ లగేజీపై 50% వరకు తగ్గింపు, ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీసులపై ఆఫర్, సీటు ఎంపికపై 15% వరకు డిస్కౌంట్, ప్రీ-బుక్ మీల్స్, అదనపు లెగ్‌రూమ్ సీట్లు (Emergency XL) రూ.500 నుంచి అందుబాటులో ఉంటాయి.
ఇదిలా ఉంటే, ఇటీవల ఇండిగో 2025-26 ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో 20% లాభాలు తగ్గాయని వెల్లడించింది. లాభం రూ.2,176 కోట్లుగా నమోదయింది. ఇంధన వ్యయాలు, కరెన్సీ ఒత్తిడులు కారణంగా ఈ తగ్గుదల చోటుచేసుకుంది. అయినప్పటికీ, కంపెనీ 84.2% ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్, 87.1% ఆన్‌టైమ్ పనితీరు సాధించి పరిశ్రమలో టాప్ లో ఉంది. FY26లో డబుల్ డిజిట్ గ్రోత్ లక్ష్యంగా పెట్టుకుంది.