ఇద్దరు భార్యలతో శృంగారం.. లైవ్ స్ట్రీమ్ చేసి మరీ...

First Published Oct 26, 2020, 10:45 AM IST

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ భర్త సభ్యసమాజం సిగ్గుపడే చర్యకు పాల్పడ్డాడు. డబ్బులకు కక్కుర్తి పడిన ఓ భర్త తన ఇద్దరు భార్యలతో పడకగదిలో గడిపిన దృశ్యాలను  లైవ్ స్ట్రీమ్ చేశాడు. 

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ భర్త సభ్యసమాజం సిగ్గుపడే చర్యకు పాల్పడ్డాడు. డబ్బులకు కక్కుర్తి పడిన ఓ భర్త తన ఇద్దరు భార్యలతో పడకగదిలో గడిపిన దృశ్యాలను లైవ్ స్ట్రీమ్ చేశాడు.
undefined
మధ్యప్రదేశ్ లోని విదీషా పట్టణంలోని ఓ భర్త తన ఇద్దరు భార్యలతో జరిపిన శృంగార వీడియోలను పలు యాప్ లలో అశ్లీల వెబ్ సైట్ల ద్వారా లైవ్ స్ట్రీమ్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. విదీషాకు చెందిన 24 ఏళ్ల యువకుడు పదోతరగతి వరకే చదివాడు.
undefined
కానీ టెక్నికల్ గా బాగా నాలెడ్జ్ ఉండడంతో డేటింగ్ యాప్ లు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాడు. ఇలాగే ఇద్దరు యువతులను మోసం చేసి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట సోషల్ మీడియాలో బెంగళూరుకు చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
undefined
ఇలాగే మొదటి పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో యువతితో ప్రేమాయణం నడిపి, ఆమెను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆగకుండా ఈ ఇద్దరు భార్యలతో శృంగారం చేస్తూ ఆ దృశ్యాలను అశ్లీ యాప్ లలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాడు.
undefined
భర్త పెట్టే చిత్రహింసలు, వేధింపులు భరించలేని రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు భార్యలతో ఈ లైవ్ స్ట్రీమ్ శృంగార బాగోతం బయటపడింది. బెంగళూరుకు చెందిన మొదటి భార్య అతనికి లొంగిపోయి అతని ఆగడాలకు సహకరిస్తుందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
undefined
నిందితుడు పలు అడల్ట్ యాప్ లలో ఖాతాలు తెరిచాడు.. ఈ ఖాతా డీపీని లైక్ చేయగానే వారికి డెమో కోసం వందరూపాయలు చెల్లించాలనే మెసేజ్ వెళుతుందని పోలీసులు చెప్పారు. అందులో తన ఇద్దరు భార్యలతో జరిపిన శృంగార వీడియోలు కనిపిస్తాయి.
undefined
నచ్చినవారు వాటిని చూడాలంటే అదనపు చార్జీలుంటాయి. భార్యలతో పడకగది దృశ్యాల వీడియోలను లైవ్ స్ట్రీమ్ చేసి నిందితుడు బాగా డబ్బు సంపాదించాడని పోలీసులు చెప్పారు. ఫేస్ లెస్, ఫేస్ స్ట్రీమింగ్ లతో వేర్వేరు చార్జీలు పెట్టాడట ఈ ప్రబుధ్దుడు.
undefined
మరో దారుణం ఏంటంటే.. ఈ ఇద్దరు భార్యల్లో ఒక భార్య 7 నెలల గర్భవతి. గత ఆగస్టు నుంచి నిందితుడు ఈ బాగోతం సాగిస్తున్నాడని పోలీసులు చెప్పారు. నిందితుడి నుంచి రూ.15.5 లక్షల విలువైన బంగారం, రూ.45వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వికాస్ పాండే చెప్పారు. నిందితుడిపై ఐపీసీతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు.
undefined
click me!