LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!

Published : Apr 28, 2026, 12:36 PM IST

ప్రపంచ ఇంధన సంక్షోభం కారణంగా ఇండియాలో మరోసారి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం… గ్యాస్ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడదాం.  

PREV
15
మళ్లీ గ్యాస్ సరఫరా రూల్స్ చేంజ్..?

వచ్చే నెల మే, 2026 నుండి ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ నిబంధనల్లో మరిన్ని మార్పులు రాబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో సరఫరా కొరత, డెలివరీలో జాప్యం, ధరల పెరుగుదల వంటి సమస్యలు తలెత్తాయి. ఈ సంక్షోభం నేపథ్యంలోనే మరోసారి సిలిండర్ బుకింగ్ నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఎల్పీజీ సిలిండర్ల పంపిణీకి సంబంధించి కొత్త నిబంధనలపై చర్చిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

25
పెరగనున్న సిలిండర్ ధరలు..?

ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు సమీక్షిస్తాయి... అయితే ప్రస్తుత గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో ధరలు పెరగడం తప్ప తగ్గడం లేదు. వచ్చే నెల మే లో కూడా ఇదే జరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది... దీన్ని తగ్గించుకునేందుకు వినియోగదారులపై భారం మోపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే 1న నెలవారి సమీక్షలో గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత పెరుగుతాయో తేలనుంది.

యూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తర్వాత గ్యాస్ కొరత నెలకొంది... దీంతో గత నెలలో (మార్చి, 2026) భారత చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ.60 మేర పెంచాయి. ఇక 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరను కూడా పెరుగుతున్నాయి… ఈ ఏప్రిల్‌లో మెట్రో నగరాల్లో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.196 పెంచాయి. 

35
గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ చేంజ్...?

పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ గ్యాప్‌ను 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గ్యాస్ పంపిణీ కోసం ప్రాధాన్యం రంగాలను నిర్ణయించడం వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు డెలివరీ సమయంలో ఓటిపి (OTP) ని తప్పనిసరి చేయనున్నట్లు సమాచారం. 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ఆధార్ ఆధారిత అథెంటికేషన్ (eKYC) చేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు eKYC చేసుకోని ఎల్పీజీ వినియోగదారులందరూ తప్పనిసరిగా పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. PMUY వినియోగదారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

45
సిలిండర్ల సరఫరాలో మొదటి ప్రాధాన్యం వీరికే..

ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ గృహ వినియోగ ఎల్పీజీ, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG), సీఎన్‌జీ (రవాణా) వంద శాతం సరఫరా జరిగేలా చూస్తున్నామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆన్‌లైన్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌లు 98%కి పెరిగాయి. అదే సమయంలో డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) ఆధారిత డెలివరీలు దాదాపు 94%కి పెరిగాయని తెలిపింది. 

ప్రస్తుతం కమర్షియల్ ఎల్పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మా, స్టీల్, ఆటోమొబైల్, విత్తనాలు, వ్యవసాయం వంటి రంగాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరాను కూడా రెట్టింపు చేశారు. 

55
పిఎన్జికి మారేలా ప్రోత్సాహకం...

చమురు, గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో, ఎల్పీజీ నుంచి పీఎన్‌జీకి మారడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులు పీఎన్‌జీ కనెక్షన్‌లు తీసుకునేలా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. పీఎన్‌జీ వినియోగదారులు తమ గృహ ఎల్పీజీ కనెక్షన్‌లను తిరిగి ఇవ్వడాన్ని, కొత్త ఎల్పీజీ కనెక్షన్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. మార్చి చివరిలో ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం పీఎన్‌జీ సౌకర్యం అందుబాటులో ఉండి కూడా కనెక్షన్ తీసుకోకపోతే, మూడు నెలల తర్వాత వారికి ఎల్పీజీ సరఫరా నిలిపివేయబడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories