ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని వీడి బీజేపీ (BJP)లో చేరిపోయారు ఎంపీ రాఘవ్ చద్దా. దీంతో ప్రస్తుతం అతడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ఈ క్రమంలో అతడి ఆస్తుల వివరాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, ఆయన భార్య పరిణితి చోప్రా ఆస్తులను పోల్చి చూస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. భర్త కంటే భార్య దగ్గరే భారీగా ఆస్తులున్నాయి.
పెళ్లికి ముందు పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పరిణితి మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.74 కోట్లు. ఆమెకు ముంబైలోని బాంద్రాలో రూ.22 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు, ఆడి-రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రాఘవ్ చద్దా మొత్తం చరాస్తుల విలువ సుమారు రూ.37 లక్షలు మాత్రమే.
25
రాఘవ్ చద్దా ఆస్తులివే..
ఒకప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ (CA)గా పనిచేసిన రాఘవ్ చద్దా చాలా పక్కాగా పెట్టుబడులు పెట్టారు. ఆయన వద్ద సుమారు రూ.30,000 నగదు, యాక్సిస్ బ్యాంకులో రూ.14.57 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. షేర్ మార్కెట్లో దాదాపు రూ.6.35 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. ఆయన వద్ద 90 గ్రాముల బంగారం ఉంది… దీని విలువ సుమారు రూ.4.95 లక్షలు. ఈయన పేరుతో 2019 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు ఉంది… దాని విలువ రూ.1.32 లక్షలుగా చూపించారు.
35
రాఘవ్ చద్దాకు సొంత ఇల్లు లేదా..?
అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే రాఘవ్ చద్దా పేరుమీద సొంతంగా ఇల్లు, కమర్షియల్ బిల్డింగులుగానీ, ఎలాంటి భూమి (స్థిరాస్తి) లేదు. ఆయన ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో లేదా ప్రభుత్వ అధికారిక నివాసంలో ఉంటున్నారు.
రాఘవ్ చద్దా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీ.కామ్ పూర్తి చేశారు. 2011లో చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పట్టా పొందారు. ఆ తర్వాత 'డెలాయిట్' (Deloitte) వంటి పెద్ద విదేశీ కంపెనీలలో పనిచేశారు. 2012లో కేజ్రీవాల్ బృందంలో చేరారు.. అప్పటి నుంచి 'ఆప్'లో కీలక నేతగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరాలనే నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
55
రాఘవ్ బాటలోనే మరికొందరు ఎంపీలు..
రాఘవ్ చద్దాతో పాటు 'ఆప్'కు చెందిన మరో 7 మంది ఎంపీలు కూడా బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. వీరిలో అశోక్ మిట్టల్ వంటి పెద్ద పేర్లు కూడా ఉన్నాయి. ఇటీవలే అశోక్ మిట్టల్ ఇంటిపై ఈడీ దాడులు జరిగాయి. 2027 పంజాబ్ ఎన్నికలకు ముందు రాఘవ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంలో చాలా కీలకమైనదిగా భావిస్తున్నారు.