Bullet Trains: వందే భారత్ రైళ్లతో భారత రైల్వే వ్యవస్థను మార్చిన ఇండియన్ రైల్వే ఇప్పుడు బుల్లెట్ ట్రైన్‌తో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. దేశంలోనే తొలి స్వదేశీ బుల్లెట్ ట్రైన్‌ను తయారు చేసే దిశగా కీలక ముందడుగు పడింది.
బెంగళూరులోని BEML సంస్థ ‘ఆదిత్య ప్లాంట్’లో దేశంలోనే మొదటి స్వదేశీ బుల్లెట్ ట్రైన్ B-28 తయారీ పనులు ప్రారంభమయ్యాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఇది భారత్ రైల్వే చరిత్రలో ఒక పెద్ద మైలురాయి గా భావిస్తున్నారు.
25
2024లో వచ్చిన కాంట్రాక్ట్
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిజైన్, తయారీ, కమిషనింగ్ పనుల కోసం 2024 అక్టోబర్‌లో BEMLకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రెండు హై-స్పీడ్ ట్రైన్‌సెట్స్ తయారు చేయనున్నారు. ఈ ట్రైన్‌ల గరిష్ట వేగం గంటకు 280 కిలోమీటర్లు ఉండనుంది. ఈ రైలు హైదరాబాద్‌లో అందుబాటులోకి వస్తే గంటలో విజయవాడ వెళ్లిపోవచ్చన్నమాట. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ. 866 కోట్లు ఖర్చు చేయనున్నారు.
35
ఎప్పుడు అందుబాటులోకి రానుంది.?
మొదటి ట్రైన్‌సెట్ 2027 మార్చి నాటికి సిద్ధం అవుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత ట్రయల్ రన్స్ ప్రారంభమవుతాయి. 2027 ఆగస్టు నాటికి ఈ బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే ఇంకొన్ని సంవత్సరాల్లోనే భారత్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రయాణం సాధ్యమవుతుంది.
మొదటిగా ఈ బుల్లెట్ ట్రైన్‌ను సూరత్, వాపీ మధ్య సుమారు 97 కిలోమీటర్ల మార్గంలో నడపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో భాగంగా ఉంటుంది. ఈ రూట్ ద్వారా హై-స్పీడ్ ట్రైన్ సేవలు పరీక్షించి తరువాత విస్తరించే అవకాశం ఉంది.
55
ట్రైన్ ప్రత్యేకతలు ఏంటి?
ఈ బుల్లెట్ ట్రైన్‌లో పూర్తి ఎసీ చెయిర్ కార్ కోచులు ఉంటాయి. సీట్లు 360 డిగ్రీలు తిరిగేలా, ముందుకు వెనక్కి బెండ్ అయ్యేలా రూపొందించనున్నారు. ప్రయాణికులకు వినోదం కోసం ఆన్‌బోర్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా హై-స్పీడ్ రైలు టెక్నాలజీలో జపాన్ వంటి దేశాలపై ఆధారపడకుండా భారత్ స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోంది.