పోర్న్ ఫిల్మ్స్ కేసు : శిల్పాశెట్టి ప్రమేయంపై పోలీసులు ఏమన్నారంటే...

First Published Jul 21, 2021, 9:49 AM IST

"అయితే ఈ కేసులో శిల్పా శెట్టి పాత్ర ఏమైనా ఉందా? అనేది మేము ఇప్పటివరకు  కనిపెట్టలేదు. దీనిమీద ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. బాధితులు ముందుకు వచ్చి  ముంబై క్రైమ్ బ్రాంచ్ ని సంప్రదించమని మేం విజ్ఞప్తి చేస్తాం, దీనిమీద తగిన చర్యలు తీసుకుంటాం" అని భరంబే తెలిపారు.

న్యూ ఢిల్లీ : అశ్లీల చిత్రాల చిత్రీకరణ, యాప్ నిర్వహణ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రను జూలై 23 వరకు పోలీసు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి పోర్న్ ఫిల్మ్స్ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
undefined
మొబైల్ యాప్ ల ద్వారా అశ్లీల చిత్రాలను ప్రసారం చేయడానికి సంబంధించిన కేసులో భార్య శిల్పా శెట్టి ప్రమేయం కూడా ఉందా అనే విషయంలో జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) మిలింద్ భరంబే మాట్లాడుతూ... ‘పోర్న్ ఫిల్మ్స్ కేసులో శిల్పాశెట్టి పాత్ర విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదు’ అని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు.
undefined
"ఈ ఫిబ్రవరిలో ముంబైలోని క్రైమ్ బ్రాంచ్ లో అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసు నమోదైంది. వెబ్ సిరీస్, షార్ట్ స్టోరీల్లో అవకాశాలు ఇస్తామని కొత్త నటులకు ప్రామిస్ చేశారు. వీటి ఆడిషన్స్‌లో సమయంలో బోల్డ్ గా, న్యూడ్ గా నటించాలని అడిగారు. దీంతో మహిళా నటులు దీనిని వ్యతిరేకిస్తూ క్రైమ్ బ్రాంచ్‌ను సంప్రదించారు. దీంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో, తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. కొంతమంది బలవంతం మీద ఇలాంటి సినిమాలు చేశారు. రాజ్ కుంద్రా బిజినెస్ ల భారత్ కార్యకలాపాలను చూసుకుంటున్న ఉమేష్ కామత్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు’’ అని మీడియాకు తెలిపారు.
undefined
"అయితే ఈ కేసులో శిల్పా శెట్టి పాత్ర ఏమైనా ఉందా? అనేది మేము ఇప్పటివరకు కనిపెట్టలేదు. దీనిమీద ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. బాధితులు ముందుకు వచ్చి ముంబై క్రైమ్ బ్రాంచ్ ని సంప్రదించమని మేం విజ్ఞప్తి చేస్తాం, దీనిమీద తగిన చర్యలు తీసుకుంటాం" అని భరంబే తెలిపారు.
undefined
ఈ ఫోర్నోగ్రఫిక్ కంటెంట్ అంతా లండన్ కి చెందిన హాట్‌షాట్స్ అనే మొబైల్ యాప్ ద్వారా అప్‌లోడ్ అవుతున్నాయని జాయింట్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
undefined
రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ ఇండస్ట్రీస్, లండన్ కి చెందిన కెన్రిన్ అనే సంస్థతో సంబంధాలు కలిగి ఉంది. కెన్రిన్ సంస్థ హాట్ షాట్స్ అనే ఓ ఇల్లీగల్ యాప్ ద్వారా.. పోర్న్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తుందని పోలీసులు తెలిపారు.
undefined
"కోర్టు అనుమతి తరువాత, మేము రాజ్ కుంద్రా కార్యాలయాలను శోధించాము మరియు కొన్ని క్లిప్లను కూడా కనుగొన్నాము. అందుకే రాజ్ కుంద్రా మరియు అతని ఐటి హెడ్ ని అరెస్టు చేశాం" అని ఆయన చెప్పారు.
undefined
అశ్లీల చిత్రాల తయారీకి సంబంధించిన కేసులో ప్రమేయం ఉన్నందుకు ఈ కేసులో రాజ్ కుంద్రాతో సహా 11 మందిని అరెస్టు చేశారు. కుంద్రాపై ఐపిసి సెక్షన్లు 420 (మోసం), 34 (సాధారణ ఉద్దేశం), 292 మరియు 293 (అశ్లీల మరియు అసభ్య ప్రకటనలు మరియు ప్రదర్శనలకు సంబంధించినవి), ఐటి చట్టం, మహిళలతో అసభ్య ప్రవర్తన (నిషేధం) చట్టం కింద కేసు నమోదు చేశారు. అన్నారు.
undefined
click me!