Viral Video : వీడూ ఓ కొడుకేనా ..!   కన్నతండ్రితో మరీ ఇంత దారుణంగానా... 

By Arun Kumar P  |  First Published Apr 28, 2024, 2:55 PM IST

కాసుల మాయలో కన్న ప్రేమను మరిచాడోో కసాయి కొడుకు. చిన్నపుడు ఆ తండ్రి గుండెలపై తంతూ ఆడుకున్నవాడు ఇప్పుడు అదే గుండెపై తన్ని ప్రాణాలు తీసాడు. 


ఈ కలికాలంలో మానవ సంబంధాల కంటే ఆర్థిక బంధాలే ఎక్కువయిపోయాయి. కొందరు కాసుల మాయలో కన్నవారిని కూడా కడతేరుస్తున్నారు. ఆస్తి కోసం కన్నకొడుకులు తల్లిదండ్రులను చితబాదుతున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటిదే ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ కసాయి కొడుకు    విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపిస్తే ఆ తండ్రి విలవిల్లాడిపోయాడు. కొడుకు దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ తండ్రి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. 

తమిళనాడుకు చెందిన ఏ. కులందైవేల (63) శ్రీ అమృత సాగో ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్నాడు. అతడు వృద్దుడు కావడంతో వ్యాపార బాధ్యతలు అప్పగించాలని, ఆస్తిని పంచివ్వాలని కొన్నాళ్లుగా గొడవపడుతున్నాడు కొడుకు సంతోష్. కానీ కారణమేంటో తెలీదుగానీ కులందైవేల కొడుకుకు ఆస్తి పంచివ్వడానికి ఇష్టపడలేదు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న సంతోష్ తాజాగా దారుణానికి ఒడిగట్టాడు. 

Latest Videos

ఆస్తి విషయంలో తండ్రితో మరోసారి గొడవకు దిగాడు సంతోష్. ఈ క్రమంలోనే తండ్రీకొడుకు మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన సంతోష్ సోఫాలో కూర్చునివున్న తండ్రిపై పిడిగుద్దులు కురిపించాడు. తండ్రి ముఖంపై బలంగా దాడిచేయడమే కాదు కాలితో ఎదలో తన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ కులందైవేల హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 

దారుణం.. ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడగు

కె. సంతోష్ (40) అనే వ్యక్తి ఆస్తి కోసం తన తండ్రి.. శ్రీ అమృత సాగో ఇండస్ట్రీస్ యజమాని ఎ. కులందైవేలు(63)పై దాడి చేశాడు. అయితే రెండు నెలలో నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 18న గుండె పోటుతో మరణించాడు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు… pic.twitter.com/qN40SFZSgI

— Telugu Scribe (@TeluguScribe)

కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ ఇంట్లోని సిసి కెమెరాను పరిశీలించగా సంతోష్ ఎంత దారుణంగా దాడిచేసాడో బయటపడింది. దీంతో ఈ కసాయి కొడుకును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు పోలీసులు. తండ్రిపై సంతోష్ దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'కన్నతండ్రిని ఇంతలా చావబాదుతున్నాడు... వీడసలు కొడుకేనా'అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.


 

click me!