అన్​స్టాపబుల్ ఇండియా.. సర్జికల్ స్ట్రైక్‌లు కొనసాగుతూనే ఉంటాయి : ప్రధాని మోదీ

Published : Oct 17, 2025, 11:21 PM IST

PM Modi: దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య దశాబ్దం క్రితం 125 వుండగా, ఇప్పుడు కేవలం 11కి తగ్గించడంలో ప్రభుత్వం విజయం సాధించిందని ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ ప్రపంచ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

PREV
15
ఉగ్రదాడుల తర్వాత భారత్ మౌనంగా ఉండదు: ప్రధాని మోదీ

ఉగ్రవాద దాడుల తర్వాత భారతదేశం ఇప్పుడు మౌనంగా ఉండదనీ, సర్జికల్, వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగిస్తూ "అనేక రోడ్‌బ్లాక్‌లు, స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పటికీ భారత్ ఇప్పుడు అన్​స్టాపబుల్" అని అన్నారు.

"ఉగ్ర దాడుల తర్వాత భారతదేశం ఇక మౌనంగా ఉండదు.. వైమానిక దాడులు, సర్జికల్ దాడులు, ఆపరేషన్ సింధూర్ లతో తగిన సమాధానం ఇస్తుంది" అని ప్రధాని అన్నారు.

25
ఉగ్రవాదంపై మౌనంగా ఉండే కాలం ముగిసిపోయింది

ఉగ్రవాదంపై మౌనంగా ఉండే కాలం ముగిసిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. “ఇప్పుడు ఆత్మనిర్భర భారత్ మౌనంగా ఉండదు. అది సర్జికల్ స్ట్రైక్‌లు, వాయు దాడులు, ఆపరేషన్ సింధూర్ లతో ఒక సముచిత స్పందన ఇస్తుంది” అని తెలిపారు. ఇటీవల పాకిస్థాతో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

35
ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదుల పై దాడి

మే 7 న భారత సైన్యాలు పాకిస్థాన్- పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), పంజాబ్ ప్రాంతాల్లో అనేక ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ ఆపరేషన్ భారత త్రివిధ దళాలు కలిసి నిర్వహించాయి. ఖచ్చితమైన దాడులతో లష్కర్ తోయిబా, జైషే మహ్మద్, హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ వంటి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయి.

ఏప్రిల్ 22 న జమ్మూ–కాశ్మీర్‌లోని పాహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. పాహల్గాం దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ క్రమంలోనే భారత్ ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 100కి పైగా ఉగ్రవాదులను టార్గెట్ చేసింది.

45
ఆర్థిక వృద్ధి, భారత్ స్థిరత్వం పై ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు యుద్ధాలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నప్పటికీ, భారత్ స్థిరంగా ముందుకు సాగిందని వివరించారు. కరోనా తర్వాత ప్రపంచంలోని చాలా దేశాలు సంఘర్షణలతో యుద్ధాలతో శీర్షికల్లో నిలిచాయి. అయితే భారతదేశం మాత్రం మరింత ప్రగతితో ముందుకు సాగతోందని ప్రధాని మోదీ అన్నారు.

“గత మూడు సంవత్సరాల్లో మన సగటు వృద్ధి 7.8 శాతం ఉంది. రెండు రోజుల క్రితం వస్తువుల ఎగుమతుల డేటా ప్రకారం భారత్ ఎగుమతులు 7 శాతం వృద్ధి పొందాయి” అని ఆయన వెల్లడించారు.

55
టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో భారత్

ఎన్డీటీవీ ప్రపంచ సదస్సులో ప్రపంచ నాయకులు, విధాన నిర్దేశకులు, సాంస్కృతిక వక్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీకి ముందుశ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య, యూకే మాజీ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని యాబాట్ లాంటి నాయకులు మాట్లాడారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగంలోని కొన్ని కీలక వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి..

  • “ఇది పండగల సమయం.. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ఈ సంతోషకరమైన వాతావరణంలో ఎన్డీటీవీ ఈ వేదికను ఏర్పాటు చేసింది. భారత్ ఇప్పుడు అన్​స్టాపబుల్.
  • ఇప్పుడు భారతదేశం ప్రపంచ టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. “మనం ఆరోగ్యంగా ముందుకు సాగాం. గత మూడు సంవత్సరాల్లో వృద్ధి 7.8%, ఎగుమతులు 7% పెరిగాయి”
  • పవర్, సెమీకండక్టర్ రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. పెద్ద టెక్ కంపెనీలు భారత్ కు వస్తున్నాయి. భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రపంచం భారతదేశాన్ని బాధ్యతాయుత భాగస్వామిగా చూస్తోంది.
  • నేడు డిజిటల్ లావాదేవీలు భారతదేశాన్ని ఆర్థిక సమగ్రత కలిగిన దేశంగా మార్చాయి.
  • మావోయిస్టు ప్రభావిత జిల్లాలు గతంలో 125 జిల్లాలు ఉండగా, ఇప్పుడు మిగిలినవి కేవలం 11 మాత్రమే. పెద్ద సంఖ్యలో నక్సల్స్ లొంగిపోయారు.
Read more Photos on
click me!

Recommended Stories