Viral Post: ‘క్యాన్స‌ర్ గెలిచింది గాయ్స్‌’.. ఇది చ‌దివితే, మ‌నిషన్న‌వాడు ఎవ్వ‌డైనా కంట‌త‌డి పెట్టాల్సిందే

Published : Oct 17, 2025, 05:55 PM IST

Viral Post: జీవితం చాలా విచిత్ర‌మైంది. ఎన్నో క‌ల‌లు కంటాం, ఎన్నో సాధించాల‌ని అనుకుంటాం. కానీ తాను ఒక‌టి త‌లిస్తే, దైవం మ‌రొక‌టి త‌లిచింది అన్న‌ట్లు ప‌రిస్థితులు మారుతుంటాయి. తాజాగా ఓ 21 ఏళ్ల యువ‌కుడు చేసిన పోస్ట్ నెటిజ‌న్ల‌ను కంట‌త‌డి పెట్టిస్తోంది. 

PREV
15
జీవితంతో చివరి పోరాటం

భారతదేశానికి చెందిన 21 ఏళ్ల యువకుడు తన జీవితంలోని చివరి దశలో ఉన్నాడు. అతను గతేడాది స్టేజ్ 4 కొలొరెక్టల్ (పెద్ద పేగు) క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని వెల్లడించాడు. గ‌డిచిన కొన్ని నెలలుగా కీమోథెరపీ, ఆసుపత్రి చికిత్సల తర్వాత వైద్యులు ఇక చికిత్సకు మార్గం లేదని తేల్చి చెప్పారు. ఈ వాస్తవం తెలుసుకున్న అతను, తాను ఈ ఏడాది చివరికి బ‌తకకపోవచ్చని వేదనతో పోస్ట్ చేశాడు.

25
“క్యాన్సర్ గెలిచింది, సీ యా…”

అతను తన చివరి పోస్ట్‌ను Reddit సైట్‌లోని r/TwentiesIndia అనే పేజీలో “Cancer won guys, see ya” అనే టైటిల్‌తో షేర్ చేశాడు. ఆ ఒక్క పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఆ పోస్టులో అత‌ను ఇలా రాసుకొచ్చాడు.. “ఈ దీపావళి నాకు చివరిది కావచ్చు. వెలుగులు, నవ్వులు, హడావుడి మిస్ అవుతాను. చుట్టూ జీవితం ముందుకు సాగుతోంది, కానీ నా జీవితం నిశ్శబ్దంగా ముగింపుకి చేరుతోంది.” అని రాసుకొచ్చాడు.

35
నెరవేరని కలలు

ఆ యువకుడు తన మనసులో దాచుకున్న కలల గురించి కూడా రాశాడు. “నాకు కలలు ఉన్నాయి. ఇంకొన్ని ప్రదేశాలు చూడాలని, ఏదో స్వంతంగా ప్రారంభించాలని, కుక్కను దత్తత తీసుకోవాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు సమయం తక్కువగా ఉందని గుర్తొస్తోంది.” అంటూ రాసుకొచ్చాడు. “ఈ ప్రపంచంలో నేను మెల్లగా కలిసిపోవడానికి ముందు, నా ఉనికికి చిన్న గుర్తు వదిలిపెట్టాలని అనిపించింది. సీ యా!!” అని త‌న ఆవేద‌న‌కు అక్ష‌ర రూపం ఇచ్చాడు.

45
కంట‌త‌డి పెడుతోన్న నెటిజ‌న్లు

ఈ హృదయాన్ని కదిలించిన పోస్ట్‌ను చూసిన తర్వాత సోషల్ మీడియాలో వేలాది మంది స్పందించారు. “దేవుడా, అద్భుతాలు నిజమైతే ఈ అబ్బాయి కోసం ఒకటి జరగనివ్వు.” అంటూ ఓ యూజ‌ర్ స్పందించ‌గా. మ‌రో యూజ‌ర్‌.. “దేవుడు ఉన్నాడంటే, దయచేసి ఈ కుర్రాడిని కాపాడు.” అన్నాడు. ఇక మ‌రికొంద‌రు యూజ‌ర్లు.. “మిత్రమా, బలంగా ఉండు. కుటుంబంతో సంతోషంగా గడుపు. సాయంత్రం వాకింగ్‌కి వెళ్ళు, మంచి పాటలు విను. అద్భుతం జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.” అని ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

55
జీవితం విలువ నేర్పిన కథ

ఈ కుర్రాడు చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది. జీవితం ఎంత క‌ఠిన‌మైందే ఈ పోస్ట్ చెబుతోంది. ఓ నెటిజ‌న్ పోస్ట్ చేస్తూ.. “మన రోజు వారీ తగాదాలు, పోటీలు అంతా అర్థంలేనివి. జీవితం ఎంత విలువైనదో ఈ పోస్ట్ చదివాక అర్థమైంది.” అంటూ రాసుకొచ్చారు. ఏది ఏమైనా ఆ కుర్రాడు చేసిన పోస్ట్ చ‌దివిన ప్ర‌తీ ఒక్క‌రూ బాధ‌ప‌డుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories