Rivaba Jadeja : భారత స్టార్ క్రికెటర్ భార్య ఒకరు రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. తాజాగా ఆమెకు ఓ రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చోటుదక్కింది. ఇంతకూ ఆ క్రికెటర్, ఆయన భార్య ఎవరు? ఏ రాష్ట్రానికి మంత్రిగా ఎంపికయ్యారు?
Ravindra Jadeja : ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి బిజెపి హేమాహేమీల సొంతరాష్ట్రం గుజరాత్ లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్టేట్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మంత్రివర్గం మొత్తం ఇటీవల రాజీనామా చేసింది... ఇవాళ(శుక్రవారం) తిరిగి కొత్త మంత్రివర్గం ఏర్పాటయ్యింది. ఇవన్నీ కేవలం ఈ రెండురోజుల్లోనే చకచకా జరిగిపోయాయి. అయితే కొత్తగా మంత్రివర్గంలో చేరినవారిలో టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా ఉన్నారు.
25
రివాబా జడేజా వ్యక్తిగత జీవితం
రివాబా జడేజా రాజ్ కోట్ నగరంలో 1990 నవంబర్ 2న జన్మించారు. తల్లిదండ్రులు ప్రపుల్లాబా, హర్ దేవ్ సింగ్ సోలంకి. గుజరాతీ సాంప్రదాయ కుటుంబంలో పుట్టిపెరిగిన రివాబా చదువులో బాగా చురుకు... విద్యాభ్యాసమంతా రాజ్ కోట్ లోనే సాగింది. ఈమె ఆత్మీయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆండ్ సైన్సెస్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. చదువు పూర్తికాగానే రివాబాను టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజాకు ఇచ్చి పెళ్లిచేశారు తల్లిదండ్రులు. ఇలా 2016 ఏప్రిల్ 17న వీరి వివాహం జరిగింది... దీంతో రివాబా సోలంకి కాస్త రివాబా జడేజాగా మారిపోయారు.
35
రివాబా జడేజా రాజకీయ జీవితం
భర్త రవీంద్ర జడేజా భార్యగా కంటే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని రివాబా భావించారు. ఇందుకు రాజకీయాలే సరైన మార్గంగా ఆమె భావించారు... భర్త రవీంద్ర కూడా అంగీకరించడంతో 2019 లో అధికార భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు రివాబా జడేజా.
ఇలా బిజెపిలో వివిధ విభాగాల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రివాబా. ఆమె సేవలను గుర్తించిన బిజెపి అదిష్టానం 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్ నగర్ నార్త్ సీటు కేటాయించింది. ఈ ఎన్నికల్లో భార్య తరపున రవీంద్ర జడేజా కూడా ప్రచారం నిర్వహించారు. దాదాపు 60 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో రివాబా తొలిసారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు... రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా జడేజా తన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను అందేలా చూస్తున్నారు. అలాగే అభివృద్ధి పనులను కూడా చేపడుతున్నారు. ఇలా ఎమ్మెల్యేగా సమర్ధవతంగా పనిచేస్తున్న ఆమె సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించకోవాలని బిజెపి అదిష్టానం, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ భావించారు. దీంతో తాజాగా తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఇవాళ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. మరి భూపేంద్ర కేబినెట్ లో రివాబా జడేజాకు ఏ శాఖ దక్కుతుందో చూడాలి.
55
గుజరాత్ నూతన మంత్రివర్గమిదే
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కొనసాగుతున్నారు. ఆయన మంత్రివర్గ నూతనంగా చేరిన సభ్యులతో తాజాగా గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర కేబినెట్ లో అవకాశం దక్కినవారు వీరే..