మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లో వర్షాలు పడుతున్నాయి. తూర్పు, పశ్చిమ మధ్యప్రదేశ్, సుబ్‌హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలో వేర్వేరు ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు బీహార్, ఛత్తీస్‌గఢ్‌లో వర్షాల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అలాగే, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ప్రస్తుతం కురుస్తున్న వానలు సెప్టెంబర్ 11 వరకు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈశాన్య రాష్ట్రాల పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన, పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్టు హెచ్చరించారు.