సిగరెట్లపై 40% GST.. కానీ మద్యంపై లేదు.. కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా?

Published : Sep 06, 2025, 11:48 AM IST

జీఎస్టీని ప్ర‌శేవ‌పెట్టిన త‌ర్వాత మొద‌టిసారి కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క మార్పులు చేసిన విష‌యం తెలిసిందే. జీఎస్టీలో చేసిన ఈ మార్పులు సెప్టెంబ‌ర్ 22వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌ద్యంపై జీఎస్టీ ఎందుకు ఉండ‌దో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
జీఎస్టీ 2.0లో మార్పులు

సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త విధానంలో పొగాకు ఉత్పత్తులపై పన్ను రేటును భారీగా పెంచారు. సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తులపై GST స్లాబ్‌ను 28% నుంచి నేరుగా 40 శాతానికి పెంచారు. అంటే ఇవి వినియోగదారులకు మరింత ఖరీదైనవిగా మారబోతున్నాయి.

25
మద్యం ఎందుకు జీఎస్టీ పరిధిలోకి రాలేదు?

పొగాకు ఉత్పత్తులకు GST వర్తిస్తే, మద్యం మాత్రం పూర్తిగా GST చట్టం నుంచి మిన‌హాయింపు ఉంటుంది. దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? ఎందుకంటే మద్యంపై పన్నులు వసూలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఆదాయ వనరులలో ఒకటి. జీఎస్టీ అమల్లోకి వస్తే, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంపై నేరుగా ప్రభావం పడుతుంది. అందుకే మద్యం పైన GST విధించకుండా, రాష్ట్రాలు తమ స్వంత ఎక్సైజ్ సుంకం, పన్ను వ్యవస్థను కొనసాగిస్తున్నాయి.

35
పెట్రోల్, డీజిల్‌కి కూడా అదే పరిస్థితి

మద్యం లాగే పెట్రోల్, డీజిల్, ముడి చమురు, సహజ వాయువు, విమాన ఇంధనం వంటి పెట్రోలియం ఉత్పత్తులు కూడా జీఎస్టీ పరిధికి బయట ఉన్నాయి. ఈ ఉత్పత్తులపై రాష్ట్రాలు VAT, కేంద్రం ఎక్సైజ్ సుంకం విధిస్తాయి. దీనివల్ల ఇంధన ధరలు రాష్ట్రాలవారీగా మారుతాయి. ఈ ఉత్పత్తులను జీఎస్టీ కిందకి తీసుకురాగానే పన్ను తగ్గిపోతుంది, ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కూడా గణనీయంగా తగ్గుతుంది.

45
రాష్ట్రాలకు భారీ ఆదాయం ఇచ్చే మద్యం పన్నులు

అయితే జీఎస్టీ ప‌రిధిలోకి రాద‌న్న కార‌ణంతో మ‌ద్యం ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉంటాయా.? అంటే క‌చ్చితంగా కాదు. ఎందుకంటే రాష్ట్రాలు తమ స్వంత ఎక్సైజ్ సుంకాన్ని భారీగా విధిస్తాయి. ఇది రాష్ట్రాల బడ్జెట్‌లో ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. అందుకే మద్యం ధరలు రాష్ట్రానికి రాష్ట్రానికి బాగా తేడా ఉంటాయి. GST కంటే వేరుగా ఉండడం వల్ల, ఈ పన్నులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో ఉంటాయి.

55
వినియోగదారులపై ప్రభావం

సిగరెట్లపై పన్ను పెంపు వల్ల ధూమపానం ఖరీదవుతుంది. దీని వెనుక ఉద్దేశ్యం – ప్రజల వినియోగాన్ని తగ్గించడం, ఆరోగ్యపరమైన ప్రమాదాలను నియంత్రించడం. కానీ మద్యం విషయంలో మాత్రం రాష్ట్రాలు అధిక పన్నులు వసూలు చేస్తున్నందున ధరలు ఇప్పటికే ఎక్కువే ఉన్నాయి. వినియోగదారులకు ఇక్కడి అసలు తేడా ఏమిటంటే సిగరెట్లపై కేంద్రం GST పెంచితే, మద్యం ధరలను రాష్ట్రాలు తమకు నచ్చినట్లుగా నిర్ణయించుకుంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories