సరిహద్దులో రోబోలను ఉపయోగించాలని మోదీకి సూచించిన టెక్ దిగ్గజం.. భార్యా,కొడుకును చంపి తాను తనువు చాలించాడు.

Published : May 01, 2025, 01:38 PM IST

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో భారతీయ సంతతికి చెందిన టెక్ వ్యాపారవేత్త హర్షవర్ధన్ S. కిక్కేరి తన భార్య శ్వేతా పనీయంతో పాటు 14 ఏళ్ల కొడుకును కాల్చి చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడీ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.   

PREV
17
సరిహద్దులో రోబోలను ఉపయోగించాలని మోదీకి సూచించిన టెక్ దిగ్గజం.. భార్యా,కొడుకును చంపి తాను తనువు చాలించాడు.
ముందు భార్య, కొడుకులను చంపి తర్వాత తాను

ఏప్రిల్ 24న న్యూకాజిల్‌లోని తన ఇంట్లో హర్షవర్ధన్ భార్య, కొడుకును చంపి తర్వాత తన ప్రాణం తీసుకున్నాడు. అయితే దీని వెనకాల ఉన్న కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. 

27
ఒక కొడుకు ఇంట్లో లేకపోవడంతో బతికాడు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వీరి మరో కొడుకు ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ఈ ఘోర సంఘటన నుంచి బయటపడ్డాడు. చుట్టు పక్కల వారు కాల్పుల శబ్దం విని తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. 

37
ఎవరీ హర్షవర్ధన్ కిక్కేరి.?

హర్షవర్ధన్ కిక్కేరి కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని కె.ఆర్. పేట తాలూకాకు చెందినవాడు. అతను మైసూరులోని రోబోటిక్స్ స్టార్టప్ హోలోవరల్డ్ వ్యవస్థాపకుడు, CEO.

47
కోవిడ్‌లో కుటుంబంతో భారత్‌కు తిరిగి వచ్చాడు

2017లో అతను అమెరికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చి హోలోవరల్డ్‌ను ప్రారంభించాడు. అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా 2022లో కంపెనీని మూసివేయాల్సి వచ్చింది.

57
మైక్రోసాఫ్ట్‌లో పనిచేశాడు, మోడీని కలిశాడు

టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన హర్షవర్ధన్ అమెరికాలో మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలో కూడా పనిచేశాడు. ప్రధాని మోడీని కలిసి సరిహద్దు భద్రతలో రోబోల వినియోగంపై ప్రజెంటేషన్ ఇచ్చాడు.

67
కారణం ఇంకా తెలియలేదు

కింగ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకారం, మరణానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఎవరైనా హత్య చేశారా.? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. 

77
వ్యక్తిగత సమస్యలా లేక ఒత్తిడా, పోలీసులు దర్యాప్తు

ఈ విషాదానికి కుటుంబ కలహాలు, మానసిక సమస్యలు లేదా ఆర్థిక ఒత్తిడి కారణమా అనేది దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఒక కంపెనీ సీఈఓ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న దానిపై సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. 

 

 

Read more Photos on
click me!

Recommended Stories