Milk price: భారీగా పెరిగిన పాల ధరలు.. లీటర్ పై ఎంతంటే..

Published : May 01, 2025, 12:09 PM IST

మదర్ డెయిరీ తర్వాత ఇప్పుడు అమూల్ కూడా తన వివిధ పాల బ్రాండ్ల ధరలను పెంచింది. కొత్త ధరలు మే 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. వేసవి తీవ్రత నేపథ్యంలో పాల ధరలు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.

PREV
19
Milk price: భారీగా పెరిగిన పాల ధరలు.. లీటర్ పై ఎంతంటే..
అమూల్ పాల ధరలు పెంపు

అమూల్ కంపెనీ పాల ధరలను లీటరుకు 2 రూపాయల వరకు పెంచింది. కంపెనీ చేసిన ఈ ధరల మార్పు మే 1 నుంచి అమలులోకి వస్తుంది. కంపెనీ అర లీటరు పాల ధరలను కూడా పెంచింది.

29
500 ML ప్యాకెట్‌పై 1 రూపాయి పెంపు

అమూల్ 500 మి.లీ. పాల ప్యాకెట్ ధరను 1 రూపాయి పెంచింది. దీంతో అమూల్ ఫుల్-క్రీమ్, టోన్డ్, డబుల్-టోన్డ్ పాల ధరలు పెరిగాయి. 

39
అమూల్ టోన్డ్ పాలు (బల్క్) ధర 56 రూపాయలు

అమూల్ టోన్డ్ పాలు (బల్క్) ధర ఇప్పుడు 54 రూపాయల నుండి 56 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా, ఫుల్-క్రీమ్ పాలు (పౌచ్) ధర 68 రూపాయల నుంచి 69 రూపాయలకు పెరిగింది.

49
అమూల్ టోన్డ్ పాలు (పౌచ్) 57 రూపాయలు

అమూల్ టోన్డ్ పాలు (పౌచ్) ధర 56 రూపాయల నుంచి 57 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా, డబుల్-టోన్డ్ పాలు 49 రూపాయల నుంచి 51 రూపాయలకు పెరిగాయి.

59
అమూల్ ఆవు పాలు 59 రూపాయలు

అమూల్ కంపెనీ ఆవు పాల ధరను కూడా పెంచింది. మే 1 నుంచి దీని ధర 57 రూపాయల నుంచి 59 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

69
మదర్ డెయిరీ పాల ధరలు పెంపు

ఇంతకు ముందు మదర్ డెయిరీ ఏప్రిల్ 30 నుంచి ఢిల్లీ-NCR ప్రాంతంతో సహా ఎంపిక చేసిన మార్కెట్లలో తన పాల ధరలను పెంచింది. మదర్ డెయిరీ కూడా బుధవారం నుంచి పాల ధరలను లీటరుకు 2 రూపాయల వరకు పెంచింది. 

79
మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ పాలు 69 రూపాయలు

మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ పాల ధర ₹67 నుంచి ₹69కి, టోన్డ్ పాలు ₹54 నుంచి ₹56కి పెరిగాయి. అదేవిధంగా, డబుల్ టోన్డ్ పాలు ₹49 నుండి ₹51కి పెరిగాయి.

89
మదర్ డెయిరీ ఆవు పాలు 59 రూపాయలు

అంతేకాకుండా, మదర్ డెయిరీ ఆవు పాల ధర ₹57 నుంచి ₹59కి పెరిగింది. ఫుల్ క్రీమ్ పాలు ₹68 నుండి ₹69కి పెరిగాయి.

99
వేర్క బ్రాండ్ పాల ధరలు కూడా పెంపు

అదేవిధంగా, వేర్క బ్రాండ్ కూడా ఫుల్ క్రీమ్ పాల ధరను లీటరుకు 2 రూపాయలు పెంచింది. టోన్డ్ , డబుల్ టోన్డ్ పాలు కూడా 2 రూపాయల వరకు పెరిగాయి.. పాల నాణ్యతలో ఎలాంటి రాజీ పడబోమని వేర్క తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories