టీవీ లేని ఇంటిని ఊహించుకోవడం కష్టం. ప్రస్తుతం లోకల్ కేబుల్ నెట్‌వర్క్‌లు సైతం డిజిటల్ రూపంలోకి మారాయి. సెటప్ బాక్సులను ఏర్పాటు చేశాయి. తాజాగా కేంద్రం తీసుకొస్తున్న ఓ నిర్ణయంతో కేబుల్ వినియోగదారులకు ఉపశమనం లభించనుందని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు టెలివిజన్ అనేది రోజు వారీ జీవితంలో విడదీయరాని భాగం. కానీ ప్రస్తుతం కేబుల్ టీవీ సేవలపై 18% జీఎస్టీ ఉండటం వల్ల వినియోగదారులు అధిక బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుపై ఆలోచనలో ఉందన్న వార్తలు వినియోగదారులకు ఆశ కలిగిస్తున్నాయి.
25
కేబుల్ పరిశ్రమ డిమాండ్
ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ (AIDCF) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వానికి ఓ లేఖను రాశారు. ప్రస్తుతం 18%గా ఉన్న జీఎస్టీని 5%కు తగ్గించాలని వారు విజ్ఞప్తి చేశారు. అధిక పన్ను భారం, శాటిలైట్ ఛానెల్‌ల రుసుములు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పోటీ వంటి సమస్యలతో పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఫెడరేషన్ వివరించింది.
35
వినియోగదారులపై ప్రభావం
జీఎస్టీ తగ్గింపునకు ప్రభుత్వం ఆమోదం తెలపితే, కేబుల్ టీవీ వినియోగదారుల నెలవారీ బిల్లులు గణనీయంగా తగ్గుతాయి. దీనివల్ల కుటుంబాలకు ఆర్థిక ఊరట లభిస్తుంది. ప్రస్తుతం ఓటీటీ, మొబైల్ డేటా ప్లాన్స్ తక్కువ ధరలకు అందుబాటులో ఉండటంతో కేబుల్ టీవీ బిల్లులు ఎక్కువగా అనిపిస్తున్నాయి. కొత్త నిర్ణయం తీసుకుంటే, కేబుల్ టీవీ మరింత చవకగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
జీఎస్టీ తగ్గింపుతో కేబుల్ టీవీ పరిశ్రమలో చిన్న స్థాయి ఆపరేటర్లకు లబ్ధి చేకూరనుంది. మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లు (MSOs), లోకల్ ఆపరేటర్లు వ్యాపారం కొనసాగించేందుకు మరింత ఆర్థిక బలం లభిస్తుంది. అంతేకాదు, వారు బ్రాడ్‌బ్యాండ్ సేవలు, డిజిటల్ మౌలిక వసతుల విస్తరణలో పెట్టుబడి పెట్టగలిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ లక్ష్యాలకు తోడ్పడే నిర్ణయంగా మారుతుంది.
55
10 లక్షల ఉద్యోగాలు
కేబుల్ టీవీ కేవలం వినోదం మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వార్తలు, విద్యా సమాచారం అందించే ముఖ్య వేదికగా ఉపయోగపడుతుంది. ఈ రంగంలో 10 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు ఉన్నాయని ఫెడరేషన్ వెల్లడించింది. జీఎస్టీ తగ్గితే వినియోగదారులకు ఆర్థిక లాభం కలిగించడమే కాకుండా ఉపాధి కూడా స్థిరంగా ఉంటుంది. ఈ నిర్ణయం ఆమోదం పొందితే, కేబుల్ టీవీ సేవలు అందరికీ మరింత సులభంగా చేరువ అవుతాయి.