మీ భార్య‌ను జిమ్‌కి వెళ్ల‌మ‌ని బ‌ల‌వంతం చేస్తున్నారా.? జైలుకు వెళ్తారు జాగ్ర‌త్త

Published : Aug 25, 2025, 02:57 PM IST

"చట్టం తెలియకపోవడం తప్పునకు మినహాయింపు కాదు" ఇది మ‌న భార‌తీయ న్యాయ వ‌వ‌స్థ బ‌లంగా చెబుతుంది.అందుకే చ‌ట్టానికి సంబంధించిన వివ‌రాలు తెలుసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. అలాంటి ఒక చ‌ట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
వెలుగులోకి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైర ఘ‌ట‌న

ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోపణల ప్రకారం భర్త ఆమెను నోరా ఫతేహి లాంటి శ‌రీరాకృతి పొందాల‌ని రోజుకు మూడుగంటల పాటు జిమ్‌లో వ్యాయామం చేయమని బలవంతం చేసేవాడు. వ్యాయామం తక్కువ చేస్తే భోజనం కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేవాడట. ఈ ఘటనతో గృహహింస, మానసిక వేధింపులు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.

DID YOU KNOW ?
నేరమే
భర్త బలవంతంగా జిమ్‌కి పంపడం, మానసికంగా లేదా శారీరకంగా వేధించడం గృహహింసలోకి వస్తుంది.
25
ఫిర్యాదు ఎలా చేయాలి?

భర్త బలవంతంగా జిమ్‌కి పంపడం, మానసికంగా లేదా శారీరకంగా వేధించడం గృహహింసలోకి వస్తుంది. బాధితురాలు సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయాలి. గాజియాబాద్ ఘటనలో బాధితురాలు మురాద్నగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

35
గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం – 2005

ఈ చట్టం ప్రకారం భార్యపై భర్త చేసే శారీరక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక వేధింపులు గృహహింసగా ప‌రిగ‌ణిస్తారు. భర్త బలవంతంగా జిమ్‌కి పంపడం, భోజనం ఇవ్వకుండా వంచించడం, శరీరంపై కామెంట్లు చేయడం ఇవన్నీ మానసిక వేధింపులకే ఉదాహరణలు. ఈ చట్టం ప్రకారం బాధితురాలు సెక్యూరిటీ ఆర్డర్, నివాస హక్కు, పరిహారం కోరవచ్చు. నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.20,000 వరకు జరిమానా ప‌డే అవ‌కాశం ఉంటుంది.

45
భారత న్యాయ సంహిత (BNS) – 85

దీని ప్రకారం భర్త లేదా అత్తింటివారు చేసే క్రూరత్వం నేరంగా ప‌రిగ‌ణిస్తారు. భర్త ప్రవర్తన వ‌ల్ల‌ మహిళకు తీవ్రమైన శారీరక లేదా మానసిక నష్టం కలిగితే ఈ చ‌ట్టం కింద కేసు నమోదు అవుతుంది. దీనికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడవచ్చు.

55
బాధితురాళ్లు గుర్తుంచుకోవలసిన విషయాలు

* భర్త బలవంతాలు, మానసిక వేధింపులు అన్నీ గృహహింస కిందకే వస్తాయి.

* సమీపంలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేయాలి.

* అవసరమైతే న్యాయ సలహా, కౌన్సిలింగ్, హెల్ప్‌లైన్ నంబర్లు వాడుకోవాలి.

* చట్టం మహిళల ప‌క్షాన ఉంటుంది. కాబ‌ట్టి ఎలాంటి భ‌యం లేకుండా ముందుకు రావాలి.

Read more Photos on
click me!

Recommended Stories