చావు ఎప్పుడు, ఎలా సంభవిస్తుందో ఎవరికీ చెప్పలేం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదం ఏదో ఒక రంగా ముంచుకొస్తుంది. తాజాగా బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి అందరినీ షాక్‌కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే..
బెంగళూరులో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 41 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాముకాటు వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఆయన చెప్పులో దాగి ఉన్న పాము కరిచడంతో ఈ ఘటన జరిగింది.
25
బాధితుడి వివరాలు
మృతుడు మంజు ప్రకాష్ (41), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో పనిచేస్తున్నారు. ఆయన బెంగళూరులోని బన్నేరఘట్టలో రంగనాథ లేఅవుట్‌లో నివసిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో బయటకు వెళ్లిన ప్రకాష్ చెరకు రసం తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో క్రాక్స్ శాండిల్స్ వేసుకున్నారు. ఇంటికి చేరాక చెప్పులను వదిలి గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు.
35
మూడు గంటల తర్వాత
సుమారు గంట తర్వాత ఇంటికి వచ్చిన ఓ కార్మికుడు చెప్పుల దగ్గర చనిపోయిన ఓ చిన్న పామును గమనించాడు. దీంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి ప్రకాష్ గదిలోకి వెళ్లి చూశారు. అప్పటికే ప్రకాష్ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. నోటిలో నురుగు, కాలు నుంచి రక్తం రావడం గమనించారు.
తక్షణమే కుటుంబ సభ్యులు ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడికి చేరుకునేలోపే ప్రకాష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పాము చెప్పులో దాక్కుని ఉండగానే కరిచినట్లు వైద్యులు భావిస్తున్నారు. ఆ పాము కూడా ఊపిరాడక మృతిచెందినట్లు గుర్తించారు.
55
పాము కాటు వేసినట్లు ఎందుకు తెలియలేదు.?
2016లో మంజు ప్రకాష్ ఓ బస్సు ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దాంతో ఆయన కాలి నరాలు బలహీనపడి స్పర్శను కోల్పోయాడు. అందువల్ల పాము కాటు సమయంలో ఆయనకు నొప్పిగా అనిపించకపోవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణంగానే ఆయన వెంటనే గుర్తించలేకపోయారని బంధువులు చెబుతున్నారు.