రాహుల్ గాంధీ చాక్లెట్లు, పెళ్లి రిజిస్ట్రేసన్, గిరిజన భాషలే.. ఈ వారం ఆసక్తికరమైన విశేషాలు

Published : Aug 31, 2025, 07:29 AM IST

ఈవారం కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనదేశంలో జరిగాయి. వాటిలో కొన్నింటిని మీరు చదవకుండా వదిలేసి ఉంటారు. వాటిని మేము ఇక్కడ అందిస్తున్నాము. ఇవన్నీ కూడా ఆసక్తిని కలిగించేవే. సాధారణ వార్తలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటాయి. 

PREV
15
నిరసనకారులకు రాహుల్ గాంధీ చాక్లెట్లు

బీహార్లోని దర్భంగాలో ఓటర్ అధికార యాత్రను చేపట్టారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఆయన వస్తున్న సందర్భంగా కొంతమంది నిరసనకారులు రోడ్డు మీదే బైఠాయించారు. అతని కారును ఆపి నల్ల జెండాలను చూపిస్తూ అడ్డుకున్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ వారికి చాక్లెట్లు పంచడానికి ప్రయత్నించారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నది భారతీయ జనతా యువమోర్చా సభ్యులే. అంటే వారు భారతీయ జనతా పార్టీకి చెందిన వారే. వారికి మిఠాయిలు అందించి శాంతింప చేయాలని రాహుల్ గాంధీ ప్రయత్నించారు. కానీ వారెవరు చాక్లెట్లు తీసుకునేందుకు ఇష్టపడలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరిగిందంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. దానికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేస్తూ రాహుల్ గాంధీని అడ్డుకున్నారు.

25
ఇలా మీ పెళ్లి చెల్లదు

అలహాబాద్ హైకోర్టు ఒక ప్రత్యేకమైన తీర్పును అందించింది. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ వివాహం చెల్లదని వెల్లడించింది. వివాహ రిజిస్ట్రేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఆధీనంలో ఉండే ప్రక్రియ అని, అది వివాహానికి అవసరమైన ఆధారాలను అందించేందుకే ఏర్పాటు చేశారని వివరించింది. ఒక కేసు విషయంలో అలహాబాద్ హైకోర్టు ఈ కామెంట్లను చేసింది. ఆ కేసులో పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆ వ్యక్తి సమర్పించలేదు. అయినా సరే తనకు మినహాయింపులు కావాలని కోరారు. దాంతో ఫ్యామిలీ కోర్టు అతని విన్నపాన్ని ఒప్పుకోలేదు. వివాహానికి రుజువు చాలా అవసరమని... అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వాలు వివాహ నమోదు ప్రక్రియలను ఏర్పాటు చేశాయని చెప్పారు. వివాహాన్ని రిజిస్టర్ చేసుకోపోతే ఆ పెళ్లి చెల్లదని కూడా కోర్టు వివరించింది. కాబట్టి అందరూ ఇకపై వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.

35
గిరిజన భాష అర్థం అయ్యేలా చేసే యాప్

మనదేశంలో గిరిజన తెగలు ఎన్నో ఉన్నాయి. వారందరూ రకరకాల భాషలు మాట్లాడతారు. దాదాపు 461 భాషలు ఉన్నాయని చెబుతారు. వాటిలో 81 భాషలో మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇక 42 భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. అందుకే గిరిజన భాషలను కాపాడేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆది వాణి అనే యాప్ ను తీసుకురాబోతోంది. దీన్ని ఏఐ సాయంతో తయారు చేశారు. దేశంలోని గిరిజన భాషలను ఇది ట్రాన్స్లేట్ చేసి అందిస్తుంది. ఈ యాప్ ను ఐఐటి ఢిల్లీ, బిట్స్ పిలాని, ఐఐఐటీ హైదరాబాద్, ఐఐఐటి నవ రాయపూర్ సంస్థలు కలిసి సృష్టించాయి. ఈ యాప్ కు ఆది వాణి అని పేరు పెట్టారు. ఈ యాప్ లో గిరిజన భాష హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువాదం అవుతాయి. అలాగే హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉన్నది గిరిజన భాషల్లోకి అనువాదం అవుతాయి.

45
చంద్రరాతి గిన్నెలను బహుమతిగా ఇచ్చిన మోదీ

జపాన్ పర్యటనలో ప్రస్తుతం మోడీ ఉన్నారు. జపాన్ వారి నుంచి ఎన్నో బహుమతులను కూడా అందుకున్నారు. అలాగే తాను కూడా తిరిగి జపాన్ ప్రధానమంత్రికి ప్రత్యేకమైన బహుమతులను అందించారు. జపాన్లో రెండు రోజులు పాటు పర్యటించిన మోడీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాకు విలువైన రాతి రామన్ గిన్నెలను, వెండితో చేసిన చాప్ స్టిక్‌లను అందించారు. ఈ రాతి రామన్ గిన్నెలు ఎంతో పాతకాలం నాటివి. అంతేకాదు ఎంతో విలువైనవి కూడా. ఆంధ్రప్రదేశ్ లో దొరికే రాతితోనే వీటిని తయారు చేస్తారు. ఇక జపాన్ ప్రధాని భార్యకు భారత ప్రధాని చేతితోనేసిన షష్మినా శాలువాను అందించారు. దీన్ని ఎన్నో గంటలపాటు కష్టపడి చేతితోనే తయారు చేశారు. కాశ్మీరీ కళాకారుల అద్భుతమైన శాలువా అది.

55
50 ఆయుధాల వల్లే పాకిస్తాన్ యుద్ధం ముగించింది

ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ తో యుద్ధానికి సిద్ధమైంది పాకిస్థాన్. కానీ రెండు రోజులకే విలవిలలాడిపోయింది. ఐఏఎఫ్ సంధించిన ఆయుధాలతో పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. ఐఏఎఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నరమదీశ్వర్ తివారి ఒక రక్షణ సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్ పై ఐఏఎఫ్ తీవ్రంగా దాడి చేసిందని, 50 కంటే తక్కువ ఆయుధాలతోనే ఈ యుద్ధానికి ముగింపు పలికిందని చెప్పారు. భారతదేశం వదిలిన క్షిపణులు పాకిస్థాన్లో భయాన్ని పెంచాయని, చివరికి కాల్పుల విరమణ కావాలని పాకిస్తానే కోరేటట్టు చేశాయని ఆయన వివరించారు.

Read more Photos on
click me!

Recommended Stories