షాంఘై సహకార సంస్థ (SCO) అనేది రాజకీయ, ఆర్థిక, భద్రతా కూటమి. దీనిలో 10 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. భారతదేశంతో పాటు, బెలారస్, చైనా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు ఉన్నాయి. ఈ కూటమిలో సభ్య దేశాలు ఉగ్రవాదం, వేర్పాటువాదం, మత అతివాదాన్ని ఎదుర్కోవడానికి కలిసి పనిచేస్తాయి. అలాగే ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడానికి కృషి చేస్తాయి. 2005 నుండి పరిశీలకుడిగా ఉన్న భారతదేశం 2017లో SCOలో సభ్యదేశంగా మారింది.