నిఘా వైఫల్యం, ధైర్యం చేయని ప్రభుత్వం: ఆ తప్పుకు 20 ఏళ్లు

First Published Dec 24, 2019, 4:55 PM IST

సరిగ్గా 20 ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మనదేశంలో ఆ తర్వాత మనదేశంలో రక్తపుటేరులు పారించి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం వెర్రి తలలు వేయడానికి ఓ కారణంగా మారింది. అదే కాందహార్ హైజాక్‌. 
 

సరిగ్గా 20 ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మనదేశంలో ఆ తర్వాత మనదేశంలో రక్తపుటేరులు పారించి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం వెర్రి తలలు వేయడానికి ఓ కారణంగా మారింది. అదే కాందహార్ హైజాక్‌.
undefined
1999 డిసెంబర్ 24న 188 ప్రయాణికులతో నేపాల్‌ రాజధాని ఖాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ-814 విమానం మార్గమధ్యంలోనే హైజాక్‌ గురైంది.
undefined
విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్లు అమృతసర్, లాహోర్, దుబాయ్‌ల మీదుగా ఆఫ్గనిస్తాన్‌లోని కాందహార్‌కు తరలించారు. వెంటనే అప్రమత్తమైన భారత ప్రభుత్వం హైజాకర్లతో చర్చలకు దిగింది. మౌలానా మసూద్ అజహర్, ముస్తాక్ అహ్మద్, షేక్ ఒమర్‌ సహా భారత్‌లోని వివిధ జైళ్లలో ఉన్న 36 మందిని విడుదల చేయాలని, 200 మిలియన్ డాలర్లు (రూ.1,400 కోట్లు) ఇవ్వాలని హైజాకర్లు డిమాండ్ చేశారు.
undefined
విమానాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న హైజాకర్లు మొదట అందులోని ప్రయాణికులకు తమ ఉనికి తెలియకుండా ఉండేందుకు గాను ప్రయాణీకుల కళ్లకు గంతలు కట్టి, ఆయుధాలతో బెదిరించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ హైజాకర్ల డిమాండ్ మేరకు బందీలను విడుదల చేశారు. ఈ క్రమంలో రుపిన్ కత్వాల్ అనే వ్యక్తి హైజాకర్ల హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా తల పైకి ఎత్తడంతో అతడిని కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటనలో చనిపోయిన ఏకైక వ్యక్తి రుఫిన్ కావడం గమనార్హం.
undefined
హైజాకర్ల పుణ్యమా అని విడుదలైన మసూద్ అజహర్ భారత్‌పై మరింత విద్వేషం వెళ్లగక్కాడు. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి.. భారత పార్లమెంట్‌, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ, పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడితో పాటు మరెన్నో దాడులు చేయించి రక్తపుటేరులు పారించాడు.
undefined
అయితే ఈ హైజాక్‌కు సంబంధించి భారత నిఘా విభాగానికి ముందుగా సమాచారం ఉంది. కానీ దీనిని ఇంటెలిజెన్స్ తేలిగ్గా తీసుకుందని వాదనలు ఉన్నాయి. అలాగే ఇంధనం నింపుకోవడానికి విమానం అమృతసర్‌లో దిగినప్పుడు మిలటరీ ఆపరేషన్ నిర్వహించి బందీలను విడిపించే అవకాశం ఉన్నా నాటి కేంద్రప్రభుత్వ పెద్దలు వేగంగా నిర్ణయం తీసుకోలేకపోయారు. దీనిపై దేశంలోని విపక్షాలు, మీడియా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి.
undefined
click me!