Premium Rice: ఈ బియ్యం కేజీ రూ.15వేలు, ఈ కేజీ బియ్యంతో ఇంట్లోకి 3 నెలల సరుకులు కొనచ్చు..!

Published : Jul 20, 2026, 11:27 AM IST

Premium Rice: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం ఏదో తెలుసా? ఈ బియ్యానికి ఇంత రేటు ఎందుకు? ఈ బియ్యంలో అంత స్పెషాలిటీ ఏం ఉంది? ఈ బియ్యాన్ని ఎవరు? ఎక్కడ పండిస్తున్నారో తెలుసా?

PREV
13
ఖరీదైన బియ్యం..

మన దేశంలో ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ప్రతిరోజూ మూడు పూటల అన్నమే తింటాం. అన్నం తిననిది మనకు భోజనం తిన్న ఫీలింగే ఉండదు. అంతేకాదు.. మన ప్రాంతాల్లోనే ఎక్కువగా ధాన్యం పండుతుంది. మనకు చాలా సులభంగా కూడా దొరుకుతుంది. ఒక కేజీ బియ్యం ఎంత ఉంటుంది? ఖరీదైన బియ్యం అయినా రూ.50 నుంచి రూ.100 ఉంటుంది. కానీ, ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన బియ్యం ఒకటి ఉందని తెలుసా? ఈ బియ్యం కేజీ కొనే ధరతో మనం ఇంట్లోకి ఏకంగా మూడు నెలలు అన్ని సరుకులు కొనేయచ్చు. అసలు.. ఈ బియ్యంలో ఉన్న స్పెషల్ ఏంటి? దీనికి అంత ధర ఎందుకు? ఈ బియ్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం..

23
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం ఇది...

ఈ బియ్యాన్ని జపాన్ లో పండిస్తారు. ‘Kinemai Premium Rice ’ దీని పేరు. ఈ బియ్యానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా గుర్తించారు. ఈ బియ్యం ధర రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ఉంటుంది.

ఈ బియ్యంలో ఉన్న ప్రత్యేకత ఇదే...

ఈ బియ్యం ఒక్క రకం కాదు. ప్రతి సంవత్సరం జపాన్ లోని వేలాది రకాల నుంచి మంచి నాణ్యత కలిగిన 4 నుంచి 6 రకాల బియ్యాన్ని ఎంపిక చేసి.. వాటన్నిటినీ కలిపి అమ్ముతారు. అందుకే.. ఈ బియ్యం.. మిగిలిన వాటి కంటే భిన్నంగా ఉంటుంది. ఈ బియ్యాన్ని పాలిష్ చేసే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా మనం తినే వైట్ రైస్ పాలిష్ చేసినప్పుడు.. దానిలోని పోషకాలు పోతాయి. కానీ.. Kinemai రైస్ లో భిన్నమైన పాలిషింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. దీని వల్ల.. బియ్యం చూడటానికి మనకు పాలిష్ చేసినట్లే కనిపించినా.. దానిలోని పోషకాలు అన్నీ అలానే ఉంటాయి. దీని వల్ల బియ్యం రుచి, టెక్చర్ చాలా బాగుంటుంది.

33
స్టోర్ చేసే విధానం...

ఈ బియ్యాన్ని పండించిన వెంటనే మార్కెట్ లోకి తీసుకువెళ్లి అమ్మరు. దాదాపు 6 నెలల పాటు దానిని ప్రత్యేక విధానంలో నిల్వ ఉంచుతారు. బియ్యాన్ని నిల్వ ఉంచడం వల్ల.. దాని రుచి పెరుగుతుందని నమ్ముతారు. అందుకే.. అలా మగ్గి.. రుచి పెరిగిన తర్వాత మార్కెట్లో అమ్మకానికి విడుదల చేస్తారు. అంతేకాదు.. ఈ బియ్యాన్ని ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయరు. చాలా తక్కువ పరిమాణంలోనే ఉత్పత్తి చేస్తారు. అందుకే... ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ బియ్యం ప్యాకేజీ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. నార్మల్ సంచుల్లో ఈ బియ్యాన్ని అమ్మరు. బ్యాగ్ పై నుంచి చూసినా చాలా ప్రీమియంగా కనపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories