చియా సీడ్స్‌లో మన శరీరానికి అత్యవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి పొట్ట కొవ్వును త్వరగా తగ్గిస్తాయి. ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) రూపంలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఇక చియా సీడ్స్ నానబెట్టిన నీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు తగ్గుతాయి. గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. దీనిలోని ఫైబర్ కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
చియా సీడ్స్ లో ఉండే ఫైబర్, ప్రోటీన్ త్వరగా పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది. దీనివల్ల కూడ బరువు త్వరగా తగ్గుతారు చియా సీడ్స్ నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్‌లో ఉంటాయి.