White hair: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే మామిడి టెంకను ఇలా వాడండి

Published : Jul 19, 2026, 07:52 AM IST

White hair: చాలా మందికి ఇప్పుడు చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతోంది. దీంతో రసాయనాలు కలిపిన హెయిర్ డైలు వాడుతున్నారు. కానీ వాటిని వాడడం మంచిది కాదు. అందుకే ఇక్కడ మేము మామిడి టెంకతో జుట్టును నల్లగా మార్చే చిట్కాను ఇచ్చాము.

PREV
13
చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య

ఒకప్పుడు 50 ఏళ్లు దాటితే కానీ జుట్టు తెల్లబడేది కాదు, కానీ ఇప్పుడు స్కూలు వయసు నుంచే జుట్టు తెలుపుగా మారిపోతోంది. జీవనశైలిలో మార్పులే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.  చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహార లోపం ఇవన్నీ కలిపి 20 ఏళ్లు జుట్టు రంగును తెల్లగా మార్చేస్తున్నాయి. తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు చాలామంది హెయిర్ డై వాడుతుంటారు. కానీ రసాయనాలతో కూడిన రంగులు వాడటం వల్ల జుట్టు పొడిబారి, బలహీనపడి రాలిపోతుంది. అందుకే ఇంట్లోనే మామిడి టెంకతో జుట్టును ఎలా నల్లగా మార్చుకోవాలో ఇక్కడ చెప్పాము.

23
మామిడి టెంక

ఇప్పుడు కూడా మామిడి కాయలు బయట దొరుకుతున్నాయి. వాటిని కొని టెంకలను తీసి పక్కన పెట్టుకోండి. మామిడి టెంక పైపొట్టు తీసేసి లోపలి గింజను శుభ్రంగా కడగాలి. దాన్ని ఎండలో బాగా ఎండబెట్టాలి. ఆ తర్వాత దాన్ని దంచి ముక్కలుగా చేసుకోవాలి. మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

33
హెయిర్ మాస్క్ తయారీ విధానం

ఇప్పుడు మామిడి టెంకతో హెయిర్ డై తయారుచేసుకోవాలి.  ఒక స్పూను మామిడి గింజల పొడి, పది లవంగాలు, 1 టీస్పూన్ టీ పొడి, 2 చెంచాల పెరుగు, నీళ్లు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా లవంగాలు, టీ పొడిని కొద్దిగా వేయించి పొడి చేయాలి. దానికి మామిడి గింజల పొడి, పెరుగు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలపొచ్చు. ఈ మిశ్రమాన్ని రాత్రంతా మూతపెట్టి పక్కన పెట్టాలి.

మరుసటి రోజు ఈ పేస్ట్‌ను తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. సుమారు గంటసేపు అలా వదిలేయాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. కావాలనుకుంటే కండిషనర్ కూడా వాడొచ్చు. ఈ హెయిర్ మాస్క్‌ను వారానికి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మాత్రం మరిపోవద్దు. దురదగా మంటగా అనిపిస్తే అది మీకు పడడం లేదని అర్థం. ఈ హెయిర్ డై సహజంగానే జుట్టును నల్లగా మార్చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories