Simple Sweet Recipe: మీ ఇంట్లో ఈ మూడు పదార్థాలు ఉంటే చాలు అప్పటికప్పుడు స్వీట్ హల్వా చేసేయొచ్చు

Published : Sep 27, 2025, 01:01 PM IST

ఎవరైనా ఇంటికి అతిధులు వచ్చినప్పుడు అర్జెంటుగా స్వీట్ పెట్టాలనుకుంటే ఇక్కడ మేము చెప్పిన ఈజీ రెసిపీ ఫాలో అయిపోండి. ఈ స్వీట్ హల్వా (Halwa) చేయడం చాలా సులువు. మూడు పదార్థాలతో దీన్ని తయారు చేసేయవచ్చు. 

PREV
15
సింపుల్ స్వీట్ రెసిపీ

పండుగలు వస్తే ఖచ్చితంగా ఇంట్లో స్వీట్లు తయారు చేయాల్సిందే. ముఖ్యంగా అమ్మవారికి ఏదో ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. అందరికీ వంటలు వచ్చే అవకాశం తక్కువ. ఇప్పుడు ఉద్యోగాలు పేరుతో మహిళలు ఎక్కువ సమయం ఆఫీసుల్లోనే ఉంటున్నారు. దీనివల్ల వారికి అన్ని రకాల వంటలు రావు. అలాంటివారికి మేము చాలా సులువైన హల్వా రెసిపీ చెబుతున్నాం. మీ ఇంట్లో కేవలం మూడు పదార్థాలు ఉంటే చాలు.. ఈ హల్వాను సులువుగా చేసేయొచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు అమ్మవారికి నైవేద్యంగా పెట్టేందుకు కూడా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు ముఖ్యంగా గోధుమపిండిని ఇంట్లో ఉండేలా చూసుకోవాలి.

25
గోధుమ పిండి హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు

ప్రతి ఇంట్లోనూ గోధుమపిండి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒక కప్పు గోధుమ పిండిని తీసి పెట్టుకోండి. అలాగే నెయ్యి అరకప్పు, పంచదార ఒక కప్పు, జీడిపప్పులు గుప్పెడు, నీళ్లు ఒక రెండు కప్పులు తీసి పక్కన పెట్టుకోండి. వీటితోనే మీరు టేస్టీ హల్వాను వండొచ్చు. పైగా 10 నిమిషాల్లోనే ఈ హల్వా రెడీ అయిపోతుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.

35
గోధుమ పిండి హల్వా రెసిపీ ఇలా

ఈ హల్వాను చేసేందుకు స్టవ్ మీద కళాయి పెట్టి పంచదారను వేయండి. అందులో రెండు కప్పుల నీటిని వేసి బాగా కలపండి. పంచదార అందులో బాగా కలిసిపోయి సిరప్ లాగా అవ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మరొక కళాయిని తీసి స్టవ్ మీద పెట్టుకోండి. అందులో నెయ్యి వేయండి. నెయ్యిలో జీడిపప్పులను ముందుగానే వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఆ జీడిపప్పులను సన్నగా తరిగి పక్కన పెట్టండి. ఇప్పుడు కళాయిలో కొంత నెయ్యి మిగిలిపోయి ఉంటుంది. ఆ నెయ్యిలో ముందుగా తీసి పెట్టుకున్న గోధుమపిండిని వేసి బాగా కలపండి. స్టవ్ మంట చాలా చిన్నగా పెట్టండి. లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది. ఆ గోధుమపిండి ఉండలు లేకుండా గరిటతో కలుపుతూనే ఉండండి.

45
మరింత నెయ్యి వేసి

గోధుమపిండి నెయ్యిలో బాగా కలిసిపోవాలి. అది అలా కలిసిపోయి దగ్గరగా అవుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ను అందులో వేసి బాగా కలపండి. ఈ మొత్తం మిశ్రమాన్ని చిన్న మంట మీద ఉంచి కలుపుతూనే ఉంటుంది. ఇది హల్వా లాగా దగ్గరగా అయ్యే వరకు కలపాలి. ఆ తర్వాత ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్నా జీడిపప్పులను పైన చల్లండి. ఈ మొత్తాన్ని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అవసరం అనుకుంటే పైన రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోండి. గోధుమపిండి హల్వా రెడీ అయిపోయినట్టే. దీన్ని చేయడం ఎంత సులువో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.

55
పంచదారకు బదులు బెల్లం

గోధుమపిండి హల్వా పిల్లలకు ఎంతో బాగా నచ్చుతుంది. నోట్లో పెడితేనే కరిగిపోయేలా ఉంటుంది. ఇంట్లో స్వీట్ రెసిపీ చేయాలనుకుంటే తక్కువ సమయం ఉన్నప్పుడు ఈ గోధుమపిండి హల్వాను ప్రయత్నించండి. అలాగే ఎవరైనా ఇంటికి అతిధులు వచ్చినప్పుడు కూడా దీనిని పెట్టవచ్చు. దసరా, దీపావళి వంటి సమయాల్లో అమ్మవారికి నైవేద్యంగా కూడా గోధుమపిండి హల్వాను అందించవచ్చు. మీకు పంచదార వాడడం అయిష్టంగా అనిపిస్తే దాని బదులు బెల్లం పొడిని వాడుకోవచ్చు. కాకపోతే హల్వా మరింత ముదురు రంగులో కనిపిస్తుంది. నిజానికి పంచదారతో పోలిస్తే బెల్లాన్ని వాడడమే మంచిది. బెల్లం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. కేవలం పావుగంటలోనే ఈ రెసిపీ అయిపోతుంది. కాబట్టి మీరు కష్టపడక్కర్లేదు. అలాగే ఇందులో వాడిన వాటిలో నెయ్యి మాత్రమే ఖరీదైనది. మిగతావన్నీ చాలా తక్కువ ధరకే వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం ఈసారి దసరాకి గోధుమపిండి హల్వా చేసేందుకు సిద్ధమైపోండి.

Read more Photos on
click me!

Recommended Stories