Oils for Hair: జుట్టును వేగంగా పెంచే నూనెలు ఇవి, కానీ వీటి గురించి ఎంతోమందికి తెలియదు

Published : Sep 27, 2025, 11:47 AM IST

జుట్టు (Hair) రాలిపోయే సమస్య ఒక్కరిది కాదు.. లక్షల మందిది. పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న పోషకాహారం వల్ల జుట్టు రాలిపోతోంది. ఇక్కడ మేము కొన్ని రకాల నూనెల (Hair Oils) గురించి ఇచ్చాము. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. 

PREV
15
జుట్టు రాలిపోతుంటే...

జుట్టు ఊడిపోయే సమస్యతో బాధపడే వారంతా రకరకాల నూనెలు, సీరమ్‌లు తలకి పూస్తూనే ఉంటారు. కానీ వాటి వల్ల వారికి ఎలాంటి ఉపయోగం ఉండదు. సహజమైన పద్ధతిలోనే జుట్టు పెరిగేలా చేసుకోవాలి. మనకు తెలిసిన నూనెలు ఎన్నో ఉన్నాయి. అలాగూ మనకి అవగాహన లేని నూనెలు కూడా ఉన్నాయి. జుట్టును పెంచే నూనెలలో మనకు తెలియనివే ఎక్కువ. అందుకే కొన్ని అసాధారణమైన నూనెల గురించి ఇక్కడ ఇచ్చాము. ఇవి జుట్టు పెరుగుదలను పెంచుతాయి. చాలా తక్కువ మందికి తెలిసిన నూనెలు ఇవి. మీకు కచ్చితంగా జుట్టు సమస్యలను తీర్చి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఇవి ఎక్కడైనా లభిస్తే ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. మీకున్న జుట్టు సమస్యలను తొలగించుకోండి.

25
మంకెట్టి నూనె

ఈ నూనె గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎంతోమంది ఈ నూనె గురించి విని ఉండరు. నిజానికి ఇది పురాతనమైన నూనె. కానీ దీన్ని వాడే వారి సంఖ్య చాలా తక్కువ. కొబ్బరి నూనె లాగే ఎప్పటి నుంచో ఈ నూనెను కూడా పూర్వీకులు వాడుతూ ఉండేవారు. కొబ్బరి నూనె లాగే ఇది కూడా కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది. మంకెట్టి నూనెలో ఉండే పోషకాలు మీ జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తాయి. పొడవుగా పెరిగేలా సహాయపడతాయి. దీనిలో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి జుట్టు చివరలు బలహీనమై విడిపోయేలా చేయవు. అందుకే ఇది జుట్టును కాపాడేందుకు ఒక గొప్ప నూనెగా చెప్పుకోవచ్చు. మంకెట్టి నూనె ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని కొని కచ్చితంగా తలకు పట్టించండి. మంకెట్టి నూనెను మోంగోంగ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. దక్షిణాఫ్రికాలో పెరిగే మంకెట్టి చెట్టులకు కాసే కాయల నుండి ఈ నూనెను తయారు చేస్తారు. హెయిర్ కేర్ ఉత్పత్తుల్లో వీటిని వాడుతూ ఉంటారు. ఇది జుట్టుకు తేమను అందిస్తుంది. కుదుళ్లను బలంగా మారుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొత్త వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది.

35
సెడార్ వుడ్ నూనె

ఈ నూనె గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ముఖ్యంగా సెంటులలో ఈ నూనెను సువాసన కోసం వాడుతూ ఉంటారు. ఈ నూనె రాయడం వల్ల తలలో నూనె ఉత్పత్తి చేసే గ్రంధులు నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. తలలో జుట్టు రాలడాన్ని తగ్గించడానికి కూడా నేను అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని దేవదారు చెక్క నూనె అని కూడా పిలుస్తారు. ఈ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఎక్కువ. జుట్టు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు కూడా. కాబట్టి చుండ్రును కూడా ఈ నూనె తొలగిస్తుంది. దేవదారు చెక్క నూనెను మీరు వాడి చూడండి. కచ్చితంగా రెండు నుంచి మూడు నెలల్లోనే మీ జుట్టులో ఎంతో మార్పు ఉంటుంది. కోనీఫర్ రకానికి చెందిన చెట్ల బెరడు, కలప, ఆకులు, కాయల నుండి ఈ నూనెను తయారు చేస్తారు. దేవదారు అనేది కూడా కోనీఫర్ చెట్ల రకానికి చెందినవే. ఇది ఈ నూనె చర్మానికి జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. నిద్రలేమి సమస్యలను కూడా తగ్గిస్తుంది. తలకు ఈ నూనె పట్టించడం వల్ల జుట్టు పెరగడమే కాదు, నిద్ర కూడా హాయిగా పడుతుంది. చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నూనెను సువాసన కోసం పెర్ఫ్యూమ్ తయారీలో ఉపయోగిస్తారు. ఒత్తిడిని తగ్గించేందుకు ప్రశాంతతను ఇచ్చేందుకు కూడా ఈ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. తలకు ఈ నూనెతో మసాజ్ చేస్తే ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది.

45
క్లారి సేజ్ నూనె

అతి అరుదైన నూనెలలో క్లారి సేజ్ ఒకటి ఇది. జుట్టు తంతువులను బలంగా మారుస్తుంది. అవి విరిగిపోకుండా అడ్డుకుంటుంది. ఒత్తిడిని తగ్గించే ప్రభావాలు కూడా దీనిలో అధికంగానే ఉంటాయి. ఎందుకంటే ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. క్లారి సేజ్ నూనె జుట్టు కుదుళ్లను బలంగా మార్చి, తలపై ఉన్న సమస్యలను తొలగిస్తుంది. వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది.

55
ఇలా వాడండి

పైన ఇచ్చిన నూనెలను ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవాలి. వాటిని నేరుగా తలపై రాయకూడదు. కొంత కొబ్బరి నూనె తీసుకొని ఆ నూనెలో పైన చెప్పిన మూడు నూనెలలో ఏదో ఒక దాన్ని కలిపి తలకు పట్టించండి. కొబ్బరి నూనె లేకపోతే అవకాడో నూనె ఉపయోగించవచ్చు. రెండింటిని సమభాగాల్లో కలిపి తలకు మూడు నిమిషాల పాటు మసాజ్ చేయండి. దీనివల్ల తలపై రక్త ప్రసరణ పెరుగుతుంది. తలమాడుకు జుట్టుకు కూడా ఈ నూనె బాగా పట్టేలా చూడండి. తర్వాత గంట పాటు అలా వదిలేయండి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. కొన్ని నెలల పాటు ఇలా మీరు పైన చెప్పిన నూనెలను వాడి చూడండి. మీకు ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories