చాలామందికి ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. అలారం ఆఫ్ చేసిన తర్వాత మెసేజ్‌లు, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం లేదా వార్తలు చూడటం సర్వసాధారణం అయిపోయింది. కానీ ఈ అలవాటు మనం ఊహించలేనంత హాని కలిగిస్తుందట తెలుసా?
నిద్ర లేవగానే మొబైల్ చూస్తే..
ఉదయం నిద్రలేవగానే మొబైల్ చూస్తే రోజంతా మన పని సామర్థ్యం తగ్గుతుంది. మనసుకు కావాల్సిన ప్రశాంతత దొరకదు. పొద్దున్నే బ్రెయిన్ లో ఎక్కువ సమాచారం నిండిపోతుందట.
మానసిక ఆరోగ్యానికి..
ఉదయం నిద్రలేవగానే మనసు, శరీరం ఉత్తేజంగా ఉండటం ముఖ్యం. కానీ నిద్రలేవగానే సోషల్ మీడియా, మెసేజ్‌లు చూడటం వల్ల మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి సమస్యలు వస్తాయట. రోజువారీ ప్రణాళిక సరిగ్గా ఉండదట.
ప్రతిస్పందనను తగ్గిస్తుంది:
పని చేయకుండా మొబైల్ చూస్తే, అది మన ప్రతిస్పందనను తగ్గిస్తుంది. దీనివల్ల రోజంతా సరిగ్గా పనిచేయలేం.
ఫోన్‌కు బానిసలు:
ఫోన్ చూడటం ఒక వ్యసనంలా మారిపోతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ అలవాటును అదుపులో ఉంచుకోవాలి.
మానేయడం ఎలా?
శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉదయం యోగా, ధ్యానం లేదా వ్యాయామం చేయండి. నడక ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల మొబైల్ చూసే అలవాటు మానవచ్చు. ఉదయాన్ని ఉపయుక్తంగా మార్చుకుంటే. రోజంతా చురుగ్గా ఉంటారు.