Pakistan vs New Zealand: పాకిస్తాన్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభమైంది. ఈ మ్యాచ్ కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగింది. సొంత గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ తన వక్రబుద్దిని చూపించి ఇజ్జత్ అంతా పోగొట్టుకుంది.
లైవ్ మ్యాచ్‌లో ఆ జట్టు తొండాటను చూసి అభిమానులే కాదు, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కూడా షాక్ అయ్యారు. బంతి బౌండరీ తాడును తాకినప్పటికీ ఫోర్ గా ఒప్పుకోలేదు. పాకిస్తాన్ స్టార్ హారిస్ రౌఫ్ కూడా బౌండరీ వద్ద తన చేతితో బంతిని తాకినట్లు అంగీకరించడానికి నిరాకరించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
అసలు ఏం జరిగింది?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ ప్రారంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. ఆ తర్వాత విల్ యాంగ్ న్యూజిలాండ్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అతను 96 పరుగుల వద్ద ఉన్నప్పుడు అద్భుతమైన షాట్ ఆడాడు, అది హారిస్ రవూఫ్‌కి బాల్ ను పట్టుకోవడం ఛేజింగ్‌గా మారింది. ఇంతలో విల్ యంగ్ 3 పరుగులు చేసారు. అయితే, రివ్యూలో చూసినప్పుడు ఫీల్డర్ చేసిన పనితో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అది బౌండరీ లైన్ ను తాకింది.