బ్యాట్‌తో కూడా పవర్ చూపించిన గ్లెన్ ఫిలిప్స్
ఈ అద్భుతమైన క్యాచ్ పట్టక ముందు, ఫిలిప్స్ బ్యాట్‌తో కూడా తన పవర్ చూపించాడు. అతను 39 బంతుల్లో 61 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. గ్లెన్ ఫిలిప్స్ ధనాధన్ ఇన్నింగ్స్ తో పాటు విల్ యంగ్ (107), టామ్ లాథమ్ (118*) సెంచరీలు చేయడంతో న్యూజిలాండ్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 320 పరుగులకు చేరింది.
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు కేవలం 260 పరుగులకే ఆలౌట్ అయింది. బాబార్ ఆజం, ఫఖర్ జమాన్ లు చాలా నెమ్మదిగా ఆడటం, ఇతర ప్లేయర్లు రాణించకపోవడంతో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ, సల్మాన్ ఆఘా 42 పరుగులు, ఖుష్దిల్ షా 69 పరుగుల ధనాధన్ బ్యాటింగ్ తో మంచి ఇన్నింగ్స్ లు ఆడారు.