సబ్బు VS బాడీవాష్... స్నానానికి ఏది మంచిది? ఎలా తెలుసుకోవాలంటే....

First Published Sep 8, 2021, 1:10 PM IST

సబ్బు? లేదా బాడీ వాష్? వీటి గురించి వీటి ప్రయోజనాలు, లాభాల గురించి తెలిస్తే నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుంది. అలాంటి ఐదు అంశాలు ఇక్కడ ఇవ్వబడింది. వీటిని చూసి.. మీకు ఏది మంచిదో మీరు ఓ నిర్ణయానికి రావచ్చు. 

స్నానం చేయడానికి ఏది మంచిది? సబ్బు? లేదా బాడీ వాష్? ఈ రెండింటి మంచి చెడుల గురించి అనేక పరిశోధనలు, అధ్యయనాలు జరిగాయి. వీటి మధ్య పోలిక... వాటిని కొనగలిగే స్థోమత, నిల్వ, పోర్టబిలిటీ, మొత్తం స్నాన ప్రక్రియను మెరుగుపరచడంలతో సాగింది. 

దీంతో ఏదీ నిర్ణయించుకోలేక తాము నమ్మిందే కరెక్ట్ అన్నట్టుగా సబ్బుకు లేదా బాడీవాష్ కే కట్టుబడి ఉంటారు చాలామంది. అయితే వీటి గురించి వీటి ప్రయోజనాలు, లాభాల గురించి తెలిస్తే నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుంది. అలాంటి ఐదు అంశాలు ఇక్కడ ఇవ్వబడింది. వీటిని చూసి.. మీకు ఏది మంచిదో మీరు ఓ నిర్ణయానికి రావచ్చు. 

ధర : సబ్బు కంటే బాడీ వాష్‌లు ఖరీదైనవి.. ఇది మామూలుగా జనసామాన్యంలో ఉన్న అవగాహన. ఇది వాస్తవమే కానీ.. మార్కెట్‌లోని అన్ని బాడీ వాష్‌ల విషయంలో ఇది నిజం కాదు. ఎన్ని స్నానాలు.. అనే లెక్క ప్రకారం చూస్తే.. సబ్బుకంటే బాడీవాష్ చక్కటి ప్రయోజనాన్ని, మీ డబ్బుకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తుంది. 

అంతేకాదు, అన్ని బాడీవాష్ లు ఖరీధైనవేమీ కాదు. అంతేకాదు ఓ రూపాయి కాసంత బాడీవాష్ మీ మొత్తం స్నానానికి సరిపోతుంది. మంచి నురగను ఇస్తుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. కాబట్టి దీన్ని వాడడం చాలా సులభం. 

టైం : బాడీవాష్ లతో స్నానం చేయాలంటే సబ్బుకంటే ఎక్కువ నీరు, ఎక్కువ సమయం పడుతుందని ఓ అపోహ ఉంది. చర్మం మీది జిడ్డును వదిలించడానికి బాడీ వాష్ కంటే సబ్బే బాగా పనిచేస్తుందని నమ్ముతారు. ఇంకా హడావుడిగా వెళ్లేవారికి బాడీవాష్ పనికిరాదని, దీంతో స్నానం చేయడం వల్ల బాత్రూంలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుందని నమ్ముతారు. అయితే ఇవన్ని వట్టి అపోహలే అంటున్నారు నిపుణులు. ఇందులో ఏ మాత్రం నిజం లేదంటున్నారు. 

అందుకే బాడీవాష్ లకు దూరంగా ఉంటారు. అయితే బాడీవాష్ లు ఉదయపు హడావుడిలో కూడా వాడొచ్చు. ఇవి మీ చర్మాన్ని మృధువుగా, స్నానాన్ని హాయిగా మార్చేస్తాయి. మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తాయి. హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. తొందరగా వదులుతాయి. ఎక్కువ శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు. బాడీవాష్ వేయడం, రుద్దడం, చర్మాన్ని శుభ్రం చేసుకోవడం అంతే. 

స్నానంలో అత్యంత సంతృప్తికరమైన విషయం ఏమిటంటే, అది మనకు శుభ్రంగా, రిఫ్రెష్‌గా ఉన్న అనుభూతిని ఇస్తుంది. బాడీ వాష్‌లు బాగా మాయిశ్చరైజ్ అవుతాయి. చర్మం పొడిబారకుండా నిగనిగలాడుతూ కనిపించేలా చేస్తుంది. ఏదైనా మంచి బాడీ వాష్ ఓ రూపాయి కాసంత వాడితే చాలు మీ స్నానం హాయిగా జరుగుతుంది. ఒక్క బాడీవాష్  80 స్నానాల వరకు సరిపోతుంది అయితే బాడీవాష్ లు వాడుతున్నప్పుడు ప్రతిరోజూ లూఫాను ఉపయోగించడం సాధ్యం కాదు. అది సున్నితమైన చర్మం ఉన్న వ్యక్తులకు అంత మంచిది కూడా కాదు కానీ ఆనందించే స్నానాలకు లూఫా లూఫా మాత్రమే కారణం కాకూడదు.

స్టోరేజ్, పోర్టబిలిటీ : సబ్బులైతే ఒకరువాడింది మరొకరు వాడతారు. ఒకేసారి ఇద్దరు వాడడానికి ఉండదు. కుటుంబసభ్యులంతా ఒకే సబ్బును వాడతారు. అంతేకాదు సబ్బులను ఎక్కడికైనా తీసుకువెళ్లాలంటే చాలా హంగామా ఉంటుంది. బాక్సులోనో, కవర్ లోనో పెట్టుకోవాలి. తడి ఆరకపోవడం వల్ల సబ్బు మొత్తం అంటుతూ ఉంటుంది. 

అదే బాడీ వాష్ విషయానికి వస్తే.. ఇందులోని ప్రతీ చుక్కా తాజాగా ఉంటుంది. ఫ్రెష్ గా మీరు మాత్రమే వాడతారు. ఒకేసారి ఎంతమందైనా వాడొచ్చు. దీన్ని ప్రయాణాల్లో తీసుకెళ్లడం ఈజీ. అదే ప్యాకింగ్ లో వస్తుంది కాబట్టి వేరే స్టోర్ చేయడం లాంటి ఇబ్బందులు ఉండవు. 

బాతింగ్ స్టైల్ : ఇంకో అతి ముఖ్యమైన అపోహ ఏంటంటే.. బాడీ వాష్ లను కేవలం షవర్‌ల కింద మాత్రమే ఉపయోగించాలి.  బకెట్ స్నానాలతో బాడీవాష్ అంత హాయిగా లేదా... ప్రభావవంతంగా ఉండదు. మన దేశంలో మెజారిటీ ప్రజలు బకెట్‌తో స్నానం చేస్తారు. అందుకే బాడీవాష్ పనికిరాదనుకుంటారు. అయితే బకెట్ స్నానానికి కూడా బాడీ వాష్ బాగా పనిచేస్తుంది. మీ చర్మానికి మంచి రిఫ్రెషింగ్ ను ఇస్తుంది.

మనలో చాలామంది మన నిర్షయాన్ని జ్ఞానం ద్వారా కాకుండా స్నేహితులను అడగడం, వారి అభిప్రాయాల ద్వారా చేస్తుంటాం. అందుకే బాడీవాష్లకు దూరంగా ఉంటారు. బాడీవాష్ లు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. మంచి బాతింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తాయి. స్నానం చేసేటప్పుడు సువాసనను, నురగను అందిస్తాయి. ఇక ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది.. వీటన్నింటిని చూసుకుని మీరు సబ్బా? బాడీవాషా? నిర్ణయించుకోవాల్సి ఉంది. 

మనలో చాలామంది మన నిర్షయాన్ని జ్ఞానం ద్వారా కాకుండా స్నేహితులను అడగడం, వారి అభిప్రాయాల ద్వారా చేస్తుంటాం. అందుకే బాడీవాష్లకు దూరంగా ఉంటారు. బాడీవాష్ లు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. మంచి బాతింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తాయి. స్నానం చేసేటప్పుడు సువాసనను, నురగను అందిస్తాయి. ఇక ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది.. వీటన్నింటిని చూసుకుని మీరు సబ్బా? బాడీవాషా? నిర్ణయించుకోవాల్సి ఉంది. 

click me!