పెళ్లికాని అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు గూగుల్ లో ఇలాంటివి వెతుకుతారా..!

First Published Sep 3, 2022, 9:32 AM IST

గూగుల్ లో ఒక్కొక్కరూ ఒక్కోటి వెతుకుతుంటారు. అంటే ఏది అవసరముంటే అది.. రీసెంట్ గా వచ్చిన డేటా ప్రకారం.. ఒంటరిగా ఉండే అమ్మాయిలు గూగుల్ లో ఏం వెతుకుతున్నారో తెలిసింది.. 
 

ఒక్క స్మార్ట్ ఫోన్ చాలబ్బా.. ప్రపంచంలోని ఏ సందున ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. అందుకే కదా.. స్కూల్ పిల్లల నుంచి.. ముసలివాళ్ల వరకు స్మార్ట్ ఫోన్లను యూజ్ చేస్తున్నారు. ఎంత చిన్న విషయం నుంచి.. ఎంత కష్టతరమైన సమాచారమైనా.. ఒక్క ఫోన్ లో టైప్ చేస్తే చాలు వితిన్ సెకన్స్ లో స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది. కంటెంట్ ఎలాంటిదైనా.. మీ కళ్లముందు ఉండాల్సిందే. అందుకే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తులు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. 

అయితే ఎవరెవరు ఏ కంటెంట్ పై గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారనే దానిపై ప్రతి ఏడాది ఒక నివేదిక వస్తుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది వచ్చిన నివేదిక ప్రకారం.. ఎవరూ లేనప్పుడు పెళ్లికాని అమ్మాయిలు గూగుల్ లో ఏం వెతుకుతున్నారనే ఆసక్తికరమైన విషయాలు వెళ్లడయ్యాయి. 
 

మీకు తెలుసా.. ఇండియాలో ఇంటర్నెట్ ను వినియోగించేవారు 15 కోట్ల మంది ఉన్నారు. ఇక వీరిలో మహిళలు 40 శాతం ఉన్నారు. అయితే వీరు ఎక్కువ మటుకు జాబ్ కు సంబంధించిన విషయాల గురించి నెట్ లో సెర్చ్ చేస్తున్నట్టు వెల్లడైంది. గూగుల్ లో పెళ్లికాని అమ్మాయిలు తమ ఫ్యూచర్ జాబ్ ప్లాన్స్ లేదా కాలేజ్ లో ఏ కోర్స్ తీసుకోవాలి.. ఏ కాలెజ్ బెస్ట్.. ఏ జాబ్ బెస్ట్ వంటి విషయాలనే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట. 
 

ఇక ఆ తర్వాత వాళ్లకు ఎంతో ఇష్టమైన షాపింగ్ గురించి సెర్చ్ చేస్తున్నారట. ట్రెండీ డ్రెస్ లు, ఇతర దుస్తులను ఆన్ లైన్ షాపింగ్ లో వెతుకుతున్నారట. వీటితో పాటుగా ఇంటి డెకరేషన్ గురించి కూడా వెతుకుతున్నారట. అలాగే ఎన్నో బ్యూటీ టిప్స్ ను కూడా సెర్చ్ చేస్తున్నారట. ఫ్యాషన్, రంగోలీ డిజైన్స్, హోమ్ డెకరేషన్స్ లాంటి విషయాలను కూడా గూగుల్ లో వెతుకున్నట్టు నివేదిక తెలిపింది.

click me!