Tulsi Plant: తులసి మొక్క ఇంట్లో నాటేందుకు మంచి రోజు ఏది? ఏ రోజుల్లో నాటకూడదు?

Published : Jan 20, 2026, 10:16 AM IST

Tulsi Plant: తులసి మొక్కకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క కనిపిస్తుంది. అయితే అది నాటేందుకు వారంలో ఏ రోజు మంచిదో తెలుసుకోండి. 

PREV
14
తులసిని ఏరోజు నాటాలి?

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. విష్ణుభక్తికి తులసి మొక్కని ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే తులసి మొక్కలు ఇంట్లో నాటేటప్పుడు అన్ని దినాలు శుభకరం కాదు. మంచి శుభదినం చూసి నాటాలని పెద్దలు చెబుతూ ఉంటారు. సాధారణంగా తులసి మొక్క నాటేందుకు అత్యంతమైన శుభకరమైన వారం గురువారం. గురువారం విష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు తులసిని నాటితే ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు. అలాగే శుక్రవారం కూడా తులసిని నాటేందుకు మంచి రోజుగా భావిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసిన రోజు. ఆ రోజు తులసిని ఇంట్లో నాటితే ధన లాభాలు కలుగుతాయని నమ్మకం ఉంది.

24
ఏ సమయంలో నాటాలి?

తులసి మొక్క నాటేందుకు అమావాస్య తర్వాత వచ్చే పౌర్ణమి కూడా మంచిదే. అలాగే ముఖ్యంగా శుక్లపక్షంలో తులసిని నాటడం శుభ ఫలితాలు ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక తులసి మొక్కను నాటేటప్పుడు రోజుతో పాటు సమయానికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. సాధారణంగా ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు గంటల నుంచి పది గంటల మధ్య తులసి మొక్కను నాటడం మంచిదిగా చెబుతారు. ఈ సమయంలో ప్రకృతి పరిశుద్ధంగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి తులసి మొక్క వేర్లు త్వరగా మట్టిలో నాటుకుంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఉదయం పూట దేవతా కార్యాలకు అనుకూలమైన సమయంగా చెబుతారు. తులసి మొక్కను నాటడానికి ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి అప్పుడు తులసి మొక్కను నాటాలి. తులసి మొక్కను నాటేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రాలు జపిస్తే ఉత్తమం.

34
ఏ రోజుల్లో నాటకూడదు?

తులసి మొక్కను నాటేందుకు కొన్ని రోజులు మాత్రం మంచిది కాదని చెబుతారు. ముఖ్యంగా మంగళవారం తులసి మొక్కను నాటకూడదు. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. ఆరోజు తులసి మొక్కను నాటడం వల్ల జీవితంలో అనవసరమైన సమస్యలు వస్తాయని అంటారు. అలాగే శనివారం కూడా తులసి మొక్కలు నాటకూడదని అంటారు. శనివారం శని గ్రహానికి సంబంధించిన రోజు. ఆరోజు తులసి మొక్క నాటితే పనుల్లో ఆలస్యం, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే అమావాస్య రోజు గ్రహణకాలంలో కూడా తులసి నాటడం ఏమాత్రం మంచిది కాదని చెబుతారు.

44
ఈ జాగ్రత్తలు

తులసి మొక్కను నాటేటప్పుడు కేవలం శుభదినం చూసుకుంటే సరిపోదు. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తులసి మొక్కకు ఎప్పుడూ శుభ్రమైన నీరు పోయాలి. అపవిత్రమైన నీరు లేదా మిగిలిపోయిన ఆహారంతో కలిసిన నీరు పోయకూడదు. తులసి మొక్క ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి నమస్కరించడం మంచిది. తులసి ఆకులను ఆదివారం ఏకాదశి రోజు ద్వాదశి రోజుల్లో కోయకూడదని శాస్త్రం చెబుతోంది. తులసి మొక్క ఎండిపోతే లేదా ఎండిపోయిన ఆకులు అలాగే ఉండిపోతే వెంటనే శుభ్రం చేసేయాలి. తులసి మొక్క ఎంత శ్రద్ధగా చూసుకుంటే ఇంట్లో అంత సానుకూల శక్తి ప్రసరిస్తుందని అంటారు.

Read more Photos on
click me!

Recommended Stories