జీన్స్ పాకెట్స్ కు మెటల్ రింగ్స్.. వీటిని ఏమంటారు, ఉపయోగమేంటో తెలుసా?

Published : Jan 20, 2026, 09:49 AM IST

ప్రస్తుతం ఆడా మగ అని తేడాలేకుండా జీన్స్ వాడుతున్నారు. ఈ క్రమంలో జీన్స్ ప్యాంట్ పాకెట్స్ వద్ద ఉండే మెటల్ రింగ్ ను ఏమంటారు… చిన్న పాకెట్ ఎందుకుంటుంది..? ఈ విషయాలు మీకు తెలుసా..? 

PREV
15
జీన్స్ ప్యాంట్ గురించి ఆసక్తికర విషయాలు..

Jeans Rivets : మనం ప్రతిరోజు కొన్ని వస్తువులను ఉపయోగిస్తుంటాం... కానీ వాటి పేర్లు ఏమిటో కూడా తెలియదు. అలాంటిదే మనం వేసుకునే జీన్స్ ప్యాంట్ కు ఉండే పాకెట్స్ వద్ద ఉండే మెటల్ రింగ్స్. వాటి పేరు ఏంటి..? ఉపయోగం ఏమిటి? అనేది చాలామందికి తెలియదు. జీన్స్ ప్యాంట్ కు ఈ మెటల్ రింగ్, చిన్న పాకెట్ ఎందుకుంటుందో తెలుసా? ఇలాంటి ఆసక్తికర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

25
జీన్స్ ప్యాంట్ కు ఉండే మెటల్ రింగ్స్ ని ఏమంటారు..?

ఈ కాలంలో జీన్స్ అనేది ఫ్యాషన్ కు మారుపేరులా మారింది. గతంలో మగాళ్లకే పరిమితం అయిన జీన్స్ ను ఇప్పుడు అమ్మాయిలూ వేస్తున్నారు... వారికోసం కూడా అనేక బ్రాండ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇలా జెండర్, వయసు, కులమతాలు, ధనిక పేద సంబంధంలేదు.. ప్రతిఒక్కరికి జీన్స్ చాలా దగ్గరయ్యింది. ఇలా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడుతున్న వస్త్రాల్లో జీన్స్ అగ్రస్థానంలో ఉంటుంది.

అయితే రెగ్యులర్ గా జీన్స్ వాడేవారు పాకెట్ వద్ద చిన్నచిన్న మెటల్ రింగ్స్ ను గమనించే ఉంటారు. వాటిని రివెట్ (Jeans Rivet) అని పిలుస్తారు. ఇవి ప్యాంటుకు ఫ్యాషన్ లుక్ ఇవ్వడంతో పాటు ఎక్కువకాలం మన్నికగా ఉండేందుకు సహాయపడతాయి. 

35
జీన్స్ రివెట్ ఉపయోగాలు

జీన్స్ ప్యాంట్స్ పాకెట్స్ వద్ద ఉండే చిన్న మెటల్ రివెట్స్ ధృడత్వాన్ని ఇస్తాయి. మనం చిన్నచిన్న వస్తువులను చేతిలో ఎక్కువసేపు పట్టుకోలేం… కాబట్టి పాకెట్స్ లో పెట్టుకుంటాం. ఈ క్రమంలో వీటివల్ల పాకెట్స్ పై ఒత్తిడి పెరిగి చిరిగిపోయే అవకాశాలుంటాయి. ఇలా జరక్కుండా ఈ రివెట్స్ ఆపుతాయి. అలాగే వీటివల్ల జీన్స్ ప్యాంట్స్ కు మంచి లుక్ వస్తుంది.

45
జీన్స్ రివెట్ ఆవిష్కరణ...

జీన్స్ ప్యాంట్లను 1870 లో లివి స్ట్రాస్, జాకబ్ డేవిస్ లు మొదటిసారి రూపొందించారు. కార్మికుల కోసం దృఢమైన దుస్తులను తయారుచేయాలని వీరు భావించారు.. ఈ క్రమంలో జీన్స్ ను రూపొందించారు. ఇది కాలక్రమేణ ఫ్యాషన్ దుస్తులుగా మారాయి.

అయితే జీన్స్ నాణ్యతను మరింత పెంచేందుకు డేవిస్ ప్యాకెట్స్ కు మెటల్ రివెట్స్ జోడించారు. 1873 లో ఈ రివెటెడ్ జీన్స్ కు పేటెంట్ పొందాడు. మొదట్లో కేవలం రాగి రివెట్స్ వాడేవారు.. కానీ ప్రస్తుతం వివిధ రకాల మెటల్స్ తో తయారుచేసిన రివెట్స్ అందుబాటులో ఉన్నాయి.

55
జీన్స్ లో చిన్న పాకెట్ ఎందుకుంటుంది..?

సాధారణంగా మనంవాడే జీన్స్ ప్యాంట్ పై నాలుగు పెద్ద పాకెట్స్ ఉంటాయి. అందులో కుడివైపున ఒక చిన్న జేబు ఉంటుంది... దానిని మీరు చూసే ఉంటారు. ఇందులో ప్రజలు ఎక్కువగా నాణేలను పెట్టుకుంటుంటారు. నిజానికి ఈ జేబును గడియారం ఉంచడానికి తయారు చేశారు. గతంలో ప్రజలు చేతి గడియారాన్ని ఉపయోగించేవారు... దీన్ని పెట్టుకునేందుకు వీలుగా చిన్న జేబును జీన్స్ కు పెట్టేవారు. అయితే ఈ చేతిగడియారం వాడకం ఆగిపోయినా జీన్స్ చిన్న ప్యాకెట్ ను కొనసాగిస్తున్నారు... ఇప్పుడు దీన్ని చిన్నచిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories