విటమిన్ల లోపం...
విటమిన్ సి.. విటమిన్ సి.. మన చిగుళ్లు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ విటమిన్ లోపం ఉంటే... చిగుళ్ల వాపు రావడం, రక్తస్రావం, బాక్టీరియాకి కారణం అవుతుంది. దీని వల్ల నోటి దుర్వాసన వస్తుంది. కాబట్టి.. ఉసిరి, జామ, కివి, ఆరెంజ్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి.
విటమిన్ డి లోపం - ఈ విటమిన్ ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. విటమిన్ డి లోపం దంతాలు బలహీనపడటానికి, దంత క్షయం ప్రమాదాన్ని పెంచడానికి, చిగుళ్ళ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది, ఇది దుర్వాసనకు దారితీస్తుంది.
పుట్టగొడుగులు,కోడి గుడ్డు, ఆవు పాలు, పెరుగు, సోయా పాలు , సోయా ఉత్పత్తులు వంటి విటమిన్ అధికంగా ఉండే ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చండి.
విటమిన్ బి 12 లోపం - విటమిన్ బి 12 లోపం నోటి పూతకు కారణమవుతుంది. జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. మీ ఆహారంలో వీలైనంత ఎక్కువగా తెలుపు లేదా ఎరుపు మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు వంటి ఆహారాన్ని తినండి.
విటమిన్ ఎ లోపం - విటమిన్ ఎ లోపం నోరు , గొంతులో తేమను తగ్గిస్తుంది. నోరు పొడిబారడం, నోటి దుర్వాసనను పెంచుతుంది.
ఫోలిక్ ఆమ్లం (విటమిన్ బి 9) లోపం - దీని లోపం చిగుళ్ళను బలహీనపరుస్తుంది. తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది, ఇది దుర్వాసనకు దారితీస్తుంది.