Ragi Roti: 30 రోజుల పాటు రాత్రిపూట రాగి రొట్టె తింటే ఏమవుతుందో తెలుసా?

Published : Aug 14, 2026, 06:52 PM IST

Ragi Roti: రాత్రి భోజనంలో రాగి రొట్టె తినే అలవాటు చాలామందికి ఉంటుంది. రాగిలో ఫైబర్, కాల్షియం వంటి పలు పోషకాలు ఉండటంతో ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా మంచి గుర్తింపు పొందింది. అయితే 30 రోజుల పాటు రాత్రిపూట రాగి రొట్టె తింటే శరీరంలో ఏం జరుగుతుందో చూద్దాం.

PREV
14
రాత్రి రాగి రొట్టె తినడం వల్ల ప్రయోజనాలు

మన ఆహారంలో చిన్న చిన్న మార్పులు కూడా ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రాత్రి భోజనంలో అన్నం, చపాతీ వంటి వాటికి బదులుగా రాగి రొట్టెను ఎంచుకునేవారు చాలామంది ఉన్నారు. రాగిలో కాల్షియం, ఫైబర్, కొన్ని ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, ఇతర బయోయాక్టివ్ పదార్థాలు ఉంటాయి. అయితే 30 రోజుల పాటు క్రమం తప్పకుండా రాత్రి రాగి రొట్టె తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో, నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

24
ఫైబర్ పుష్కలం

రాగి రొట్టెను రాత్రి భోజనంలో చేర్చుకోవడం వల్ల ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. రాగిలో ఇతర సాధారణ ధాన్యాలతో పోలిస్తే మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అయితే రాగి రొట్టెను ఎక్కువ నూనెతో కాల్చడం లేదా దానితో ఎక్కువ కొవ్వు, కేలరీలు ఉన్న పదార్థాలను తినకపోవడం మంచిది.

అలాగే కాల్షియం ఎక్కువగా ఉండే ధాన్యాల్లో రాగులు ముందు వరుసలో ఉంటాయి. మన రోజూవారీ ఆహారంలో రాగులను చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

34
షుగర్ నియంత్రణలో..

నిపుణుల ప్రకారం.. రాగిలో ఉండే ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ వంటి పదార్థాలు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ, గ్లూకోజ్ విడుదల వేగాన్ని ప్రభావితం చేస్తాయి. దానివల్ల బ్లెడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే రాగులను పిండిగా ఎలా తయారు చేశారు? ఎంతగా ప్రాసెస్ చేశారు? రొట్టె ఎలా చేశారు? దానితో ఏ ఆహారం తీసుకున్నారు.. వంటి అంశాలు కూడా ముఖ్యమే అనే విషయాన్ని మర్చిపోవద్దు.

రాగి రొట్టెను రాత్రి భోజనంలో తీసుకోవడం వల్ల కొంతమందికి కడుపు నిండిన భావన ఎక్కువసేపు కలుగుతుంది. దాంతో రాత్రి భోజనం తర్వాత మళ్లీ స్నాక్స్, స్వీట్లు లేదా ఇతర అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలనే కోరిక తగ్గవచ్చు. ఇది బరువు నియంత్రణలో పరోక్షంగా సహాయపడుతుంది.

44
ఇది మర్చిపోవద్దు..

ప్రతిరోజూ రాగి రొట్టె తినేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒకే ఆహారాన్ని ప్రతిరోజూ ప్రధానంగా తీసుకోవడం కంటే, వివిధ రకాల ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గింజలు, తగిన ప్రోటీన్ వనరులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది.

అలాగే రాగి రొట్టె తిన్న తర్వాత కొంతమందికి గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలగవచ్చు. అలాంటి సందర్భాల్లో రాగి రొట్టె తీసుకునే పరిమాణాన్ని తగ్గించి, తగినంత నీరు తాగడం మంచిది. ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు లేదా ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించేవారు డాక్టర్ సలహా తర్వాత ఆహారంలో మార్పులు చేసుకోవడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories