లవంగాల్లో 'యూజినాల్' అనే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, చర్మ కణాలను కాపాడుతుంది. దీనివల్ల చర్మం యవ్వనంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
ముడతలు, గీతలు తగ్గుతాయి:మన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో లవంగం నీరు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వాడితే ముఖంపై వచ్చే సన్నని గీతలు, ముడతలు తగ్గుతాయి. ఫలితంగా యవ్వనంగా కనిపిస్తారు.
మొటిమలు, మచ్చలు మాయం: లవంగాల్లోని యాంటీబాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాని నశింపజేస్తాయి. మొటిమలు, వాటి వల్ల వచ్చే ఎర్రటి మచ్చలను తగ్గించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా, ఇది సహజసిద్ధమైన ఆస్ట్రింజెంట్‌గా పనిచేసి, ముఖంపై ఉండే పెద్ద చర్మ రంధ్రాలను (Open Pores) బిగుతుగా మార్చి చర్మాన్ని సమంగా ఉంచుతుంది. ఈ టోనర్ వాడటం వల్ల రోజంతా ముఖం ఫ్రెష్ గా కనపడుతుంది. జిడ్డుగా మారదు.