Weight Loss: మంతెన చెప్పిన ఈ మూడు ఫాలో అయితే.. వారానికి మూడు కేజీలు తగ్గడం ఖాయం

Published : Jan 21, 2026, 01:17 PM IST

Weight Loss: బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా మంది కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. కానీ.. హ్యాపీగా తింటూ కూడా బరువు తగ్గవచ్చని మంతెన చెబుతున్నారు. 

PREV
14
weight loss

ప్రముఖ ప్రకృతి చికిత్సా నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రావు గారు సూచించిన జీవన శైలి మార్పులు ఎంతో మంది మహిళల జీవితాల్లో అద్భుతమైన మార్పులను తీసుకువచ్చాయి. జిమ్ కి వెళ్లి గంటల తరబడి కష్టపడకుండానే, కేవలం ఆహార నియమాలతోనే బరువు తగ్గి, అందంగా ఎలా మారాలో ఆయన వివరించిన మూడు ముఖ్యమైన సూత్రాలు ఇక్కడ ఉన్నాయి..

అందంగా కనిపించాలని, సన్నగా అవ్వాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. కానీ బిజీ లైఫ్ వల్ల వ్యాయామం చేయడానికి సమయం ఉండదు. ఇలాంటి వారి కోసం మంతెన సత్యనారాయణ గారు మూడు అద్భుతమైన గోల్డెన్ రూల్స్ సూచించారు. వీటిని పాటిస్తే.. బరువు తగ్గడమే కాకుండా... ముఖంలో సహజమైన మెరుపు కూడా వస్తుంది.

24
రూల్ నెంబర్ 1..

బరువు తగ్గడానికి ప్రయత్నించేవారికి ఏం తింటున్నారు అనేది ఎంత ముఖ్యమో.. ఏ సమయానికి తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. చాలా మంది.. రాత్రి పదింటికి డిన్నర్ చేస్తారు. మేము ఒక్క చపాతీనే తిన్నాం అండీ అయినా బరువు తగ్గడం లేదు అని చెబుతారు. అలా కాదు... రోజులో మీ చివరి భోజనం సాయంత్రం 6 కి ముగియాలి. అంతే ఆ తర్వాత ఇంక ఏమీ తినకూడదు. అంతేకాదు ఆ తినే ఆహారం కూడా చాలా తేలికగా ఉండాలి. అన్నం, చపాతీలు కాకుండా వీలైనంత వరకు పండ్లు తీసుకోవాలి. కావాలంటే నానపెట్టిన నట్స్ లాంటివి తీసుకోవచ్చు. ఇవి చాలా సులభంగా జీర్ణం అవ్వడంతోపాటు.. తొందరగా బరువు తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఈ పండ్లు, నట్స్ కారణంగా మనకు పొట్ట రాదు.. వీటిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఈ .. చర్మ సౌందర్యం పెంచడంలో సహాయం చేస్తాయి.

34
రూల్ 2.. లంచ్ లో ఇవి ఫాలో అవ్వాలి...

చాలా మంది లంచ్ లో కూర తక్కువ, అన్నం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఆ పొరపాటు ఎప్పుడూ చేయకూడదు. బరువు తగ్గాలి అనుకునేవారు ఈ ఫార్ములా మార్చుకోవాలి. మధ్యాహ్నం ఒక చిన్న గంటెడు అన్నం మాత్రమే తినాలి. మల్టీ గ్రెయిన్ రోటీలు రెండు తినవచ్చు.కూరల్లో కచ్చితంగా ఆకు కూర ఉండేలా చూసుకోవాలి. రెండు, మూడు కూరలు ఉండేలా చూసుకుంటే మంచిది. కూరలతో కడుపు నిండేలా చూసుకోవాలి. అంతేకాకుండా రెండు, మూడు రకాల మొలకలు తీసుకోవాలి.

44
రూల్ 3..మంచినీరు ఎక్కువగా తాగాలి..

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి నీరు అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి.. మర్చిపోకుండా ప్రతిరోజూ 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది గ్యాస్ సమస్యలను నివారించడమే కాకుండా, శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

ఈ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల కలిగే ఫలితాలు...

ఈ మూడు రూల్స్ ని క్రమం తప్పకుండా ఫాలో అవ్వడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. కఠినమైన వ్యాయామాలు చేయకపోయినా శరీరం తేలికగా మారుతుంది. రాత్రి పండ్లు తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం వల్ల మొటిమలు తగ్గి, ముఖం అందంగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఈ డైట్ తో నార్మల్ గా కంటే చాలా యాక్టివ్ గా మారిపోతారు. వారం రోజుల్లోనే తేడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories