Kitchen Hacks: ప్రెషర్ కుక్కర్ మన పనిని ఎంతో సులభం చేసింది. పప్పులు, నాన్‌వెజ్ త్వరగా ఉడకడానికి ఉపయోగపడుతుందని తెలిసిందే. అయితే కుకర్ నుంచి పప్పు లేదా నీరు పొంగడం వంటి సమస్య చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది.
కుక్కర్‌లో పప్పు ఉడికిస్తే ఎందుకు బయటికి వస్తుంది?
ప్రెషర్ కుక్కర్‌లో దాల్, బీన్స్, బియ్యం ఉడికించే సమయంలో చాలామందికి ఎదురయ్యే సమస్య ఒకటే. విజిల్ వచ్చే సమయంలో తెల్లటి నురుగు బయటికి రావడం. దీనికి ప్రధాన కారణం ఆ ఆహార పదార్థాల్లో ఉండే స్టార్చ్. ఉడికే సమయంలో స్టార్చ్ నీటితో కలసి నురుగుగా మారుతుంది. ఆ నురుగు ఆవిరి ఒత్తిడితో బయటికి వస్తుంది.
25
నురుగు బయటికి రావడం వల్ల ఇబ్బందులు ఏమిటి?
కుక్కర్ నుంచి నురుగు బయటికి వస్తే వంటగది మొత్తం మురికి అవుతుంది. గ్యాస్ స్టౌవ్ పై పప్పు పడుతుంది. కొన్నిసార్లు కుక్కర్ విజిల్ చుట్టూ అతుక్కుని శుభ్రం చేయడం కూడా కష్టం అవుతుంది. ఇలా వంట చేయడం ఒక చికాకుగా మారుతుంది.
35
కుక్కర్‌లో నురుగు బయటికి రాకుండా ఎలా ఆపాలి?
ఈ సమస్యను పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే చాలావరకు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా దాల్, బీన్స్, బియ్యం వంటివి కుక్కర్‌లో వేసేటప్పుడు ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.
కుక్కర్‌లో దాల్ వేసిన తరువాత ఒక స్పూన్ నూనె లేదా నెయ్యి వేసాలి. ఇలా చేయడం వల్ల నురుగు ఏర్పడే ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతుంది. దాంతో నురుగు బయటికి రావడం తగ్గుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కుక్కర్‌ను ఎప్పుడూ ఎక్కువగా నింపకూడదు. పప్పు ఉడికించే సమయంలో కుక్కర్ సగం వరకే నింపితే మంచిది.
55
స్టీల్ చెంచా ఉపయోగించే సులభమైన ట్రిక్
నూనె లేదా నెయ్యి వేయడం ఇష్టం లేని వారికి మరో సులభమైన మార్గం ఉంది. కుక్కర్ మూసే ముందు లోపల ఒక శుభ్రమైన స్టీల్ చెంచా పెట్టాలి. ఉడికే సమయంలో ఏర్పడే బుడగలను ఈ చెంచా పగులగొడుతుంది. దాంతో నురుగు నియంత్రణలో ఉంటుంది. ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే దాదాపు 90 శాతం వరకు కుక్కర్ నుంచి నురుగు బయటికి వచ్చే సమస్య తగ్గుతుంది. వంటగది శుభ్రంగా ఉంటుంది.