బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నారా? అయితే ఈ పండ్లను తప్పకుండా తినండి..

First Published Jan 26, 2023, 2:59 PM IST

బరువును తగ్గించడంలో పండ్లు కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను తినడం వల్ల ఆకలి కోరికలు తగ్గి అధిక బరువు, ఊబకాయం సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

fruits

చాలా మంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గడానికి చాలా మంది మొదటగా చూసేది ఆహారాన్నే.  బరువు తగ్గాలనుకునే వాళ్లు కొన్ని రకాల ఆహారాలను ఎక్కువగా తింటూ.. కొన్ని ఆహారాలను పూర్తిగా మానేస్తుంటారు. అయితే  వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్లు పండ్లను ఖచ్చితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి పండ్లు బాగా పనిచేస్తాయి. ఇంతకీ బరువు తగ్గాలంటే ఎలాంటి పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నారింజ

నారింజ సిట్రస్ పండు. ఇది సహజంగా కేలరీలు తక్కువగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పండులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. 2014 అధ్యయనం ప్రకారం.. నారింజ పండులో నీటిలో కరిగే విటమిన్ ఊబకాయాన్ని నివారించడానికి,  బరువును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. బరువును తగ్గించే ఆహారంలో నారింజ అత్యంత ప్రాచుర్యం పొందిన పండు. అందుకే ఈ పండును ఖచ్చితంగా తినండి. 
 

guava

జామకాయ

బరువు తగ్గడానికి సహాయపడే మరో పండు జామకాయ.  ఈ పండులో  37 కేలరీలు మాత్రమే ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే జామపండు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. 
 

దానిమ్మ పండ్లు

దానిమ్మలో ఉండే పాలీఫెనాల్స్, లినోలెనిక్ ఆమ్లం కలయిక కొవ్వును తగ్గించడానికి, శరీరంలో జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ఎంతో అనువైన పండు. దానిమ్మలో డైటరీ ఫైబర్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 
 

సీతాఫలాలు

సీతాఫలంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ పండులో మన శరీరానికి అవసరమైన ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గడానికి మంచిదని భావించే ఫైటోకెమికల్స్ కూడా ఈ పండులో ఎక్కువ మొత్తంలో ఉంటాయి.  సీతాఫలాల్లో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి.
 

ద్రాక్ష పండు

ఎర్ర ద్రాక్షలోని ఎలిజియాక్ ఆమ్లం శరీరంలో కొవ్వు కణాల పెరుగుదలను మందగించేలా చేయడానికి సహాయపడుతుందని ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు.  అందుకే  బరువు తగ్గడానికి ఈ పండును ఖచ్చితంగా తినండి. 

click me!