ఏం చేసినా బరువు తగ్గడం లేదా? వీటిలో తేనె కలిపి తీసుకోండి.. మీరు ఊహించని విధంగా బరువు తగ్గుతారు

First Published Jan 29, 2023, 4:58 PM IST

బరువు తగ్గడానికిని చాలా మంది తీపి పదార్థాలకు దూరంగా ఉంటారు. కానీ తేనె బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

honey

కొన్ని చెడు అలవాట్ల వల్లే నేడు ఎంతో మంది విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. నిజానికి బరువు పెరగడం ఏమంత గొప్ప విషయం కాదు. ఎందుకంటే దీనివల్ల ప్రాణాంతక రోగాలొచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, ఊబకాయం, కొలెస్ట్రాల్, డయాబెటీస్, గుండె జబ్బులకు దారితీస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా బరువును అదుపులో పెట్టుకోవాలి. సాధారణంగా బరువు తగ్గేందుకని చాలా మంది తీపి పదార్థాలకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఈ తీపి బరువును మరింత పెంచుతుంది. కానీ తేనె ఇలా కాదు. ఈ సహజ తీపి పదార్థం బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

honey

బరువును తగ్గించడానికి తేనె ఎలా సహాయపడుతుందది? 

తేనెలో సహజ తీపి ఉంటుంది. నిజానికి శుద్ది చేసిన చక్కెర వినియోగం వల్లే బరువు పెరిగిపోతారు. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే విటమిన్లు, ఖనిజాలు కూడా తక్కువగా ఉంటాయి. వీటివల్ల బరువు బాగా పెరుగుతారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. తేనెలో ఉన్న ఇతర ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు దానిలో ఉన్న చక్కెర ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల ఇది శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

honey

చాలా మంది డైటీషియన్లు బరువు తగ్గడానికి పరిమిత మొత్తంలో తేనెను తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే తేనెలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గుతున్న వారికి ఎంతో సహాయపడుతుంది. అలాగే తేనె వంటి ఫ్రక్టోజ్ కలిగిన ఆహారాలు కొవ్వును కరిగించడానికి, స్టామినాను పెంచడానికి సహాయపడతాయని ఒక అధ్యయనం కనుగొంది.

Image: Getty Images

తేనె కూడా జీర్ణక్రియకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత ఒక చెంచా తేనె తీసుకోవడం వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. తేనె ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటిస్, అల్సర్, జలుబు, దగ్గు, కిడ్నీ స్టోన్స్, కొలెస్ట్రాల్, స్ట్రోక్ మొదలైన సమస్యలను తగ్గించడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.  బరువు తగ్గడానికి తేనెను వేటిలో కలిపి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

దాల్చినచెక్క, తేనె

పోషకాలు పుష్కలంగా ఉండే దాల్చిన చెక్కను ఎన్నో ఏండ్ల నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ మసాలాను వివిధ రకాల రుచికరమైన వంటకాలను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. తేనె, దాల్చిన చెక్క కలయిక బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
 

గ్రీన్ టీ, తేనె

మీరు తాగే గ్రీన్ టీలో దాల్చిన చెక్క, తేనెను కలిపి తాగొచ్చు. దీనితో పాటుగా అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని, తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే కూడా మంచిది. ఈ రెండు సూపర్ ఫుడ్స్ లోని మెటబాలిక్ గుణాలు రోజంతా మిమ్మల్ని ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. ఇవి ఆకలిని కూడా నియంత్రిస్తాయి. దీంతో మీరు అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలను తీసుకోరు. 
 

నిమ్మకాయ, తేనె

ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగడం వల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. ఇది మీ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. అలాగే రోజంతా మీ శరీరంలో శక్తిని కాపాడుతుంది. దీని వల్ల మీరు రోజంతా మరింత చురుగ్గా ఉంటారు.
 

తేనె, వెల్లుల్లి

2 నుంచి 3 వెల్లుల్లి మొగ్గలను మెత్తగా నూరి అందులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి ప్రతిరోజూ ఉదయం తీసుకోవాలి. ఇది మీ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, అలాగే మీ జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. 
 

పాలు, తేనె

పాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచేటప్పుడు మీ ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీనితో పాటుగా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించి బ్లడ్ ప్రెజర్ ను నార్మల్ గా ఉంచడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పాలలో తేనెను కలిపి తాగడం వల్ల ఈ చర్యలన్నీ మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో తేనె కలిపి తాగితే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. కావాలనుకుంటే రుచి కోసం యాలకుల పొడిని కూడా కలుపుకోవచ్చు.

click me!