ఈ చిన్న మార్పులతో...వ్యాయామం చేయకుండానే ఈజీగా బరువు తగ్గొచ్చు...!

First Published Jul 12, 2021, 4:47 PM IST

బరువు తగ్గాలని కఠినమైన ఆహారనియమాలు, డైట్లు, ఎక్సర్ సైజులు.. నోటిని కట్టేసుకోవడం.. ఆకలి కాకుండా నీటిని ఎక్కుగా తాగుతుండడం... ఇలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. 

బరువు తగ్గాలని.. సన్నగా, నాజూగ్గా కనిపించాలని.. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే బరువు తగ్గడం అనేది శారీరకంగా, మానసికంగా పెద్ద ఛాలెంజింగ్ గా ఉంటుంది.
undefined
దీనికోసం కఠినమైన ఆహారనియమాలు, డైట్లు, ఎక్సర్ సైజులు.. నోటిని కట్టేసుకోవడం.. ఆకలి కాకుండా నీటిని ఎక్కుగా తాగుతుండడం... ఇలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
undefined
దీనివల్ల కొన్నిసార్లు నీరసపడిపోవడం.. ఆ పద్ధతి మానేయగానే మళ్లీ బరువు పెరగడం జరుగుతుంటుంది. అయితే ఇవేవీ లేకుండా ఎలాంటి శారీరక వ్యాయామాలు చేయకుండానే బరువు తగ్గే ఉపాయాలు ఉన్నాయి.
undefined
మీ భోజనాన్ని మీరే వండుకోండి : పరోక్షంగా పనిచేయమని చెప్పడంలా అనిపిస్తుంది. అయితే అది కాదు మీరు బైటి ఫుడ్ లేదా వేరేవాళ్లు వండిన ఆహారం తినడం వల్ల అందులో ఏమేం కలుపుతున్నారో మీకు అవగాహన ఉండదు.
undefined
అందుకే స్వయంగా మీరే వండుకోవడం వల్ల ఆయిల్స్, క్యాలరీలు తక్కువగా ఉండేలా చూసుకుంటారు. ఇక తినేప్పుడు కూడా ఇష్టంగా, ప్రతీ బుక్క ఆస్వాదిస్తూ తినగలుగుతారు.
undefined
ఇష్టంగా, నెమ్మదిగా తినండి : స్పీడ్ గా తినడం అంటే జంక్ ఫుడ్ తిన్నదానితో సమానం. గబగబా తినడం వల్ల ఎక్కు కేలరీలు గెయిన్ అవ్వడమే.
undefined
అందుకే తినడంలో తాబేలును తలుచుకోండి. నెమ్మదిగా, బాగా నములుతూ తినండి. దీనివల్ల తక్కువ ఆహారం తీసుకున్నా సంతృప్తిగా తిన్న భావన కలుగుతుంది.
undefined
మీ చుట్టూ ఆరోగ్యకరమైన ఆహారాలే ఉండేలా చూసుకోండి. సైంటిఫిక్ గా చూసుకుంటే మన చుట్టూ కంటికి కనిపించే ఆహారాన్ని తింటుంటాం. అందుకే అలాంటివి మీ కంటికి అందుబాటులో లేకుంటే.. మీరు వాటిని తినరు. దీంతో అనారోగ్యకరమైన ఆహారం తినరు. దీనివల్ల బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది.
undefined
ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి వల్ల బరువు పెరిగే సమస్య ఎక్కువవుతుంది. నిద్ర లేకపోవడం, ఒత్తిడి వల్ల తీవ్రమైన హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల బరువు తగ్గే ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది.
undefined
ఒత్తిడి మిమ్మల్ని ఆక్రమించుకోకుండా చూసుకోండి. దీనివల్ల అనవసరంగా ఏవేవో ఫుడ్స్ తింటారు. ఇలా కాకుండా ఉండాలంటే.. డి విటమిన్ శరీరానికి వచ్చేలా సన్ బాత్ చేయండి. లేదంటే ఉదయపు ఎండలో కాసేపు కూర్చోంది. విటమిన్ డి శరీర బరువు తగ్గడంలో బాగా సహాయపడుతుంది.
undefined
ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే.. టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ భోజనం చేయకపోవడం. వాటిని చూస్తూ చిరుతిండ్లు తినడం వల్ల శరీరానికి ఎక్కువ నష్టం కలుగుతుంది. దీంతో అటోమేటిగ్గా బరువు పెరుగుతారు.
undefined
సీరియల్స్, వెబ్ సిరీస్ లు, పోన్లు చూసేప్పుడు తినకుండా ఉండలేకపోతున్నాం అనుకుంటే పండ్లు, డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు, తక్కువ క్యాలరీలు ఉండే పేలాలు, ఫాక్స్ సీడ్స్, పాప్ కార్న్ లాంటివి తినండి.
undefined
సీరియల్స్, వెబ్ సిరీస్ లు, పోన్లు చూసేప్పుడు తినకుండా ఉండలేకపోతున్నాం అనుకుంటే పండ్లు, డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు, తక్కువ క్యాలరీలు ఉండే పేలాలు, ఫాక్స్ సీడ్స్, పాప్ కార్న్ లాంటివి తినండి.
undefined
click me!