Best Nightwear: రాత్రి హాయిగా నిద్రపోవాలా? అయితే ఈ 5 రకాల దుస్తులు బెస్ట్ ఆప్షన్!

Published : Jun 01, 2026, 03:43 PM IST

Best Nightwear: రాత్రిపూట ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోవాలంటే మనం తినే ఫుడ్, బెడ్ ఎంత ముఖ్యమో.. మనం వేసుకునే బట్టలు కూడా అంతే ముఖ్యం. ఒంటికి అతుక్కుపోకుండా, గాలి ఆడేలా ఉండే దుస్తులు నిద్ర నాణ్యతను పెంచుతాయి. అలాంటి కొన్ని దుస్తుల గురించి తెలుసుకుందాం.

PREV
15
మంచి నిద్రకోసం బెస్ట్ దుస్తులు

నాణ్యమైన నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. కానీ చాలామంది రాత్రిళ్లు సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతుంటారు. ఒత్తిడి, జీవనశైలి మాత్రమే కాదు, మనం నైట్ టైంలో వేసుకునే దుస్తులు కూడా నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతాయి. నిపుణుల ప్రకారం శరీరానికి గాలి ఆడేలా, సౌకర్యంగా ఉండే ఫాబ్రిక్‌లు మంచి నిద్రకు సహాయపడతాయి. అలాంటి దుస్తుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

కాటన్ పైజామా, టీ షర్ట్

నిపుణుల ప్రకారం కాటన్ దుస్తులు నిద్రకు అత్యంత అనుకూలమైనవి. కాటన్ ఫ్యాబ్రిక్ మృదువుగా ఉండటమే కాకుండా శరీరానికి గాలి సులభంగా ప్రవహించేలా చేస్తుంది. ఇది చెమటను పీల్చుకుని శరీరాన్ని పొడిగా ఉంచుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో లూజ్‌గా ఉండే కాటన్ పైజామా, టీ-షర్ట్ శరీరంపై ఒత్తిడి లేకుండా రిలాక్స్‌ డ్ గా ఉంచుతాయి. బిగుతుగా ఉండే దుస్తులు రక్తప్రసరణను ప్రభావితం చేసి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.

25
లినెన్ దుస్తులు

లైట్ వెయిట్ దుస్తుల్లో లినెన్ ఫ్యాబ్రిక్ ముందు వరుసలో ఉంటుంది. నిపుణుల ప్రకారం లినెన్ దుస్తులు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచి చెమట సమస్యను తగ్గిస్తాయి. ఇవి హైజీనిక్‌గా ఉండటంతో బ్యాక్టీరియా పెరుగుదలను కూడా తగ్గిస్తాయి. నిద్ర సమయంలో శరీరం పూర్తిగా రిలాక్స్ కావడానికి లూజ్ లినెన్ నైట్‌వేర్ చాలా మంచి ఆప్షన్.

35
శాటిన్, సిల్క్ దుస్తులు

శాటిన్, సిల్క్ దుస్తులు మృదువైన టెక్స్చర్ కారణంగా చాలా సౌకర్యంగా అనిపిస్తాయి. నిపుణుల ప్రకారం ఇవి శరీరంపై ఒత్తిడిని కలిగించవు. చలికాలంలో ఇవి శరీరం వేడిని నిలుపుకోవడంలో సహాయపడతాయి. వేసవిలో అయితే లైట్‌వెయిట్ శాటిన్ ఉపయోగించడం మంచిది. చాలా టైట్‌గా ఉండే సిల్క్ దుస్తులు కాకుండా లూజ్ ఫిట్ నైట్‌వేర్ ఎంచుకోవడం మంచిది.

45
బాంబూ ఫ్యాబ్రిక్

బాంబూ ఫ్యాబ్రిక్ ని ఈ మధ్య కాలంలో చాలామంది వాడుతున్నారు. నిపుణుల ప్రకారం ఇది సహజంగా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ అలెర్జిక్ గుణాలు కలిగి ఉంటుంది. చెమటను త్వరగా పీల్చుకునే సామర్థ్యం ఉండటం వల్ల శరీరం పొడిగా, ఫ్రెష్‌గా ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఇది చాలా మంచి ఎంపిక. బాంబూ దుస్తులు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసి వేసవిలో చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉండేలా చేస్తాయి.

55
కాఫ్తాన్ దుస్తులు

కాఫ్తాన్ దుస్తులు లూజ్ ఫిట్, ఫ్లోయింగ్ డిజైన్‌తో ఉండటం వల్ల రాత్రి టైంలో చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. నిపుణుల ప్రకారం ఇవి శరీరానికి ఎలాంటి ఒత్తిడి కలిగించవు. గాలి సులభంగా ప్రవహించేలా ఉండటంతో శరీరం చల్లగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో కాఫ్తాన్ నైట్‌వేర్ చాలా మంచి ఎంపిక. ఇవి స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా పూర్తి రిలాక్సేషన్‌ను అందిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories