Period Mood Swings: కొంతమంది మహిళలకు పీరియడ్స్ ముందు చికాకు, కోపం పెరిగిపోతాయి. తమ భర్తలతో చిన్న విషయాలకే గొడవపడతారు. చిన్న విషయాలకే ఏడుపు మొదలుపెడతారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది?
కొంతమంది మహిళలు పీరియడ్స్‌కు కొన్ని రోజుల ముందు నుంచి చాలా అసహనంగా ఉంటారు. చిన్న విషయాలకే గొడవపడటం, అరవడం, కోపం, అసహనం చూపించడం చేస్తుంటారు. ముఖ్యంగా భర్త, పిల్లలపైనే కోపమంతా చూపిస్తూ ఉంటారు. అసలు పీరియడ్స్ కు ముందు ఇలా ఎందుకు జరుగుతుంది? పీరియడ్స్‌కు ముందు భార్యలు ఎందుకు గొడవపడతారు? ప్రతి భర్త ఈ విషయం తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి.
24
భావోద్వేగాలను అదుపు లేక
పీరియడ్స్‌కు ముందు మహిళల తీరు మారిపోతుంది. వారికి చిన్న ఘటనలు కూడా మహిళలకు చాలా పెద్దవిగా అనిపిస్తాయి. చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవుతారు. మనసులో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది. ఆ బాధ ఎందుకు వారికి అర్థం కాదు. జనాలు ఎక్కువగా కనిపించినా, పెద్ద శబ్దాలు విన్నా చిరాకు వస్తుంది. ఆ సమయంలో ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. దీనికి కారణం పీరియడ్స్ కు ముందు వారిలో భావోద్వేగపరంగా అసమతుల్యత ఏర్పడుతుంది.
34
హార్మోన్లలో మార్పులు
పీరియడ్స్ కు ముందు మహిళల శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల వారిలో వేడి పెరుగుతుంది. దీనివల్ల వారు ఆ సమయంలో చాలా చిరాకుగా ఉంటారు. కఠినమైన మాటలు మాట్లాడతారు. ప్రశాంతంగా ఉండలేరు. ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో 'పిత్త' దోషం పెరగడమే దీనికి కారణం.
పీరియడ్స్‌కు ముందు ఏది పడితే అది తినడం కూడా మంచిది కాదు. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల ఉన్నట్టుండి కోపం, చిరాకు, నీరసంగా అనిపించడం వంటివి జరుగుతాయి. మన శరీరం, భావోద్వేగాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి కాబట్టి ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి.
పీరియడ్స్‌కు ముందు మహిళల మెదడు కాస్త భిన్నంగా పనిచేస్తుంది. అతిగా ఆలోచించడం, మానసికంగా అలసిపోవడం, ఒంటరిగా ఉండాలనుకోవడం, ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వంటివి జరుగుతాయి. దీనికి కారణం మన నాడీ వ్యవస్థ సమతుల్యంగా పనిచేయకపోవడమే.
కొన్ని భావోద్వేగాలు పీరియడ్స్‌కు ముందు చాలా బలంగా అనిపిస్తాయి. ఆ సమయంలో శరీరం భావోద్వేగాలను తీవ్రంగా వ్యక్తపరుస్తుంది. దీనివల్ల పాత కోపాలు, నిరాశ మళ్లీ బయటకు వస్తాయి. సులభంగా ఏడుపు రావడం, మనసు భారంగా మారడం, వెంటనే స్పందించడం వంటివి జరుగుతాయి.