High Heels హై హీల్స్ వేస్తే మెంటల్ టెన్షనా? ఇదెక్కడి బాధరా నాయనా?

పొడుగ్గా కనిపించాలనో.. అందంగా ఉండాలనో అమ్మాయిలు హై హీల్స్ వేసుకుంటుంటారు. ఫంక్షన్ అయినా, పెళ్లి అయినా, పార్టీ అయినా.. హై హీల్స్ వేసుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. కానీ ఎప్పుడూ హై హీల్స్ వేసుకోవడం అస్సలు మంచిది కాదట. దీని వల్ల మెంటల్ హెల్త్ మీద ఒత్తిడి పెరుగుతుందట. తాజా అధ్యయనం అదే చెబుతోంది మరి.

Understanding the Mental and Physical Downsides of High Heels
చెప్పుకోలేని సమస్యలు

హై హీల్స్ వేసుకుంటే పాదాల మీద, గోళ్ల మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీని వల్ల పాదాలకి, మడమలకి చర్మం గట్టిగా అయిపోవచ్చు. గోళ్ల చుట్టూ పొక్కులు రావచ్చు. హై హీల్స్ వేసుకుంటే శరీరం బరువు అంతా పాదం ముందుకి వచ్చేస్తుంది. దీని వల్ల మోకాళ్ళ నొప్పులు, మడమల నొప్పులు, ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది.

వెన్నుపూస మీద ఎఫెక్ట్

హై హీల్స్ వేసుకుంటే బాడీ బ్యాలెన్స్ కోసం ఎక్కువ ఎనర్జీ వాడాల్సి వస్తుంది. ఇది వెన్నుపూస మీద, బాడీ బ్యాలెన్స్ మీద నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. రెగ్యులర్ గా హై హీల్స్ వేసుకుంటే జాయింట్స్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. దీని వల్ల ఆర్థరైటిస్ ఇంకా జాయింట్స్ సమస్యలు వచ్చే రిస్క్ ఉంది.


మానసికంగా ఎఫెక్ట్

హై హీల్స్ వల్ల శారీరకంగా, మానసికంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే హై హీల్స్ వేసుకోవడం వల్ల నడిచే స్పీడ్ తగ్గిపోతుంది. ఇది బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇతరులు నన్ను గమనిస్తున్నారా? పొట్టిగా ఉండటాన్ని కప్పిపుచ్చుకోవడానికి హీల్స్ వాడుతున్నాని వాళ్లు అనుకుంటున్నారా.. అంటూ పదేపదే ఆలోచిస్తుంటారు. దీంతో దీర్ఘకాలంలో ఇది మానసిక సమస్యలు, ఒత్తిడికి దారి తీస్తుంది. 

Latest Videos

vuukle one pixel image
click me!