Skin Care: రాత్రికి ఈ ఐదు చేస్తే.. ఉదయానికి మెరిసిపోతారు..!

 
ఏదైనా పండగ, శుభకార్యం వచ్చిందంటే ఆ రోజున స్పెషల్ గా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఒక్క రోజులో ముఖంలో గ్లో రావడం అంటే అంత ఈజీ కాదు అని  అనుకుంటున్నారా? అయితే.. మీరు కేవలం ఒక రోజు ముందు కొన్ని సహజ పద్దతులు వాడితే.. మరుసటి రోజున రెట్టింపు అందంతో మెరిసిపోతారు.మరి, ఏం చేస్తే.. మీ ముఖంలో గ్లో పెరుగుతుందో తెలుసుకుందామా..
 

festive glow 5 effective skincare rituals in telugu ram
Beauty Care


అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా పండగ, పెళ్లి, ఫంక్షన్ ఉంటే.. అందరికంటే స్పెషల్ గా కనపడాలని అమ్మాయిలు తహతహలాడుతుంటారు. అయితే, అలా కనిపించాలంటే మేకప్ వల్ల మాత్రమే సాధ్యం అనే భావన చాలా మందిలో ఉంటుంది.లేదంటే పార్లర్ కి అయినా పరుగులు తీయాలి అనుకుంటారు.  కానీ, మేకప్ అవసరం లేకుండా, సింపుల్ గా కొన్ని పద్దతులు పాటించినా కూడా మీరు అందరికంటే అందంగా కనిపించొచ్చు. 

festive glow 5 effective skincare rituals in telugu ram


1.స్క్రబ్ చేయండి...
మనం మన చర్మాన్ని అందంగా ఉంచుకోవాలి అంటే బేసిస్ స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి. దానిలో మొదటిది మన ముఖాన్ని శుభ్రంగా ఉంచడం. మీరు రెగ్యులర్ గా వాడే ఫేస్ వాష్ తో ఫేస్ ని శుభ్రం చేసుకున్న తర్వాత... స్మూత్ గా స్క్రైబ్ చేయాలి. స్క్రబ్బింగ్ కి బయట ఉత్పత్తులతో పని లేదు. ఇంట్లో ఉన్నవాటినే ప్రయత్నించొచ్చు. ఓట్ మీల్ లేదంటే బియ్యం పిండితో మీ ముఖాన్ని స్క్రైబ్ చేయాలి. దీని వల్ల మీ ముఖం తాజాగా, మృదువుగా కూడా మారుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ మొత్తం తొలగిపోయి.. ముఖం చాలా ఫ్రెష్ గా కనపడుతుంది.


2. సహజ ఫేస్ మాస్క్ తో హైడ్రేట్ చేయండి

స్క్రబ్బింగ్ తర్వాత చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఫేస్ మాస్క్ వేసుకోవడం. మన స్కిన్ అందంగా కనిపించాలంటే, మన ముఖం డ్రైగా ఎండిపోయినట్లుగా కాకుండా.. మంచిగా కనపడాలి. అంటే మన చర్మానికి తేమ అవసరం. దాని కోసమే మనం ఫేస్ మాస్క్ వేయాలి. దానిని కూడా  కలబంద, తేనె, పెరుగు వంటివి వాడొచ్చు. ఈ మూడు మీ చర్మానికి తేమనిస్తాయి. పండుగకు కొన్ని రోజుల ముందు 2-3 సార్లు ఈ మాస్క్ వేసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది.
 

3. ఆయుర్వేద నూనెలు రాయండి..
మన ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగినప్పుడు.. ముఖం గ్లో వచ్చినట్లుగా మంచిగా కనపడుతుంది. దాని కోసం మనం సున్నితంగా ముఖానికి మసాజ్ చేయడం చాలా అవసరం. మీరు కొబ్బరి నూనె, బాదం నూనె, నువ్వుల నూనె వంటి నూనెలను వాడొచ్చు. ఈ నూనెలు  చర్మానికి చాలా మంచిది. ఈ నూనెలను ముఖానికి మర్దన చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం మెరుస్తూ కనపడుతుంది.

4. సన్ స్క్రీన్ తప్పనిసరి

మీరు ఎలాంటి మేకప్ లు, క్రీములు రాయకపోయినా, ఎండలో బయటకు వెళ్లకపోయినా, సీజన్ తో సంబంధం లేకుండా ముఖానికి రాయాల్సింది ఏదైనా ఉంది అంటే అది సన్ స్క్రీన్ మాత్రమే.ప్రతి ఒక్కరూ స్కిన్ కేర్ లో భాగంగా ముఖానికి కచ్చితంగా సన్ స్క్రీన్ రాయాలి. ఇది  మీ చర్మాన్ని UV కిరణాల నుంచి కాపాడుతుంది. ఇది రాయడం వల్ల చర్మం దెబ్బతినదు.
 


5. సమతుల్య ఆహారం, నీరు ముఖ్యం..
కేవలం పై పై మెరుగులు దిద్దితే అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. అందం శాశ్వతంగా ఉండాలి అంటే.. అది లోపలి నుంచి మొదలవ్వాలి. అది ఆహారంతో మాత్రమే సాధ్యం అవుతుంది.మీరు తినే ఆహారం మీ చర్మంపై కనిపిస్తుంది. పండ్లు, కూరగాయలు, గింజలు ఎక్కువగా తినండి. నీళ్లు, హెర్బల్ టీలు తాగడం వల్ల చర్మం లోపలి నుంచి తేమగా ఉంటుంది.

Latest Videos

vuukle one pixel image
click me!