సొంత వైద్యం వద్దు
ప్రతి సమస్యకూ సొంత వైద్యం పనికి రాదు. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా డాక్టర్‌ను సంప్రదించి, ఆయన సూచిన విధంగానే మందులు వాడాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. డాక్టర్లు అయితేనే మీ వయసు, బరువు, మీకున్న గత సమస్యల ఆధారంగా మందులు సూచిస్తారు. ఒకరకమైన మెడిసిన్ అందరికీ ఒకేలా పని చేయదు.
సాధారణంగా డాక్టర్లు భోజనం తర్వాత కొన్నిరకాల మందులు వేసుకొమ్మని చెబుతారు. దాని అర్థం తిన్న వెంటనే వేసుకొమ్మని కాదు. కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకుంటే మంచిది. కనీసం ఐదు నిమిషాలైన విరామం ఉండాలి. భోజనం చేసిన వెంటనే టాబ్లెట్ వేసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి.
కొంతమంది రెండు మూడు టాబ్లెట్లు ఒకేసారి మింగేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఒకటికొకటి రియాక్షన్ అవుతుంటుంది. కొన్నిరకాల మందులు కలిపి వేసుకోవడం వల్ల ఏదీ ప్రభావం చూపించకుండా అవుతుంది. ట్యాబ్లెట్ కి ట్యాబ్లెట్ కి మధ్య ఐదు నిమిషాలైనా విరామం ఉండాలి.